విరాట్ నువ్వు ఆడుతుంది దేశానికి అని గుర్తుంచుకో... కపిల్ దేవ్ కామెంట్...

First Published Aug 31, 2022, 2:39 PM IST

విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని ఆడించడం కంటే, ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం కరెక్ట్ అంటూ భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఆసియా కప్ 2022లో పాక్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు కపిల్ దేవ్...

Virat Kohli

మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ పెద్దగా క్రికెట్ ఆడింది లేదు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ పాల్గొనలేదు... 

Image credit: PTI

తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. 34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే కోహ్లీ, విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు...

‘విరాట్ కోహ్లీ ఫామ్ గురించి నాకు ఎలాంటి బాధ లేదు, అతను టీమిండియాలోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. అతను ఆడిన కొన్ని షాట్స్ చాలా చక్కగా ఉన్నాయి. విరాట్ మరింత కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేయాలి...

virat kohli

విరాట్ దాదాపు నెల తర్వాత ఆడుతున్నాడు, అయినా అతనిలో కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గలేదు. తొలి ఓవర్‌లో లక్కీగా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు, ఆ తర్వాత తన క్లాస్ ఆటతీరు చూపించాడు...

Image credit: Getty

విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ నాకెంతో ఇష్టం. గత పదేళ్లుగా అతని యాటిట్యూడ్ వల్లే విరాట్ కోహ్లీ మిగిలిన ప్లేయర్ల కంటే పెద్ద క్రికెటర్‌గా మారాడు. దేశానికి ఆడుతున్నప్పుడు పరుగుల గురించి ఫోకస్ పెట్టకూడదు. ఎంత కొట్టాం అనేది కాకుండా కొట్టిన పరుగులు, జట్టుకి ఎంత ఉపయోగపడ్డాయనేది ముఖ్యం...

virat kohli

విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఆ విషయాన్ని మరిచిపోడు. దేశానికి ఆడడాన్ని గర్వంగా భావిస్తాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడానికి పెద్ద సమయమేమీ పట్టదు. అతనికి ఒకే ఒక్క మంచి ఇన్నింగ్స్ చాలు... అది త్వరలోనే వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్... 

click me!