కాఫీ తాగి వచ్చాకే హార్ధిక్ పాండ్యా ఇలా మారిపోయాడు... టీమిండియా ఆల్‌రౌండర్‌పై అజయ్ జడేజా...

Published : Aug 31, 2022, 03:34 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిపోయాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్‌ 2022లో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కి తొలి సీజన్‌లోనే టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యా, ఐర్లాండ్‌ టూర్‌లో భారత జట్టుకి సారథిగానూ వ్యవహరించి సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆసియా కప్ 2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు హార్ధిక్ పాండ్యా...

PREV
16
కాఫీ తాగి వచ్చాకే హార్ధిక్ పాండ్యా ఇలా మారిపోయాడు... టీమిండియా ఆల్‌రౌండర్‌పై అజయ్ జడేజా...

బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్ మూడో బంతికి సింగిల్ తీయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఫినిష్ చేస్తానంటూ దినేశ్ కార్తీక్‌కి సైగ చేసి చెప్పాడు...

26
Hardik Pandya

ఆ తర్వాతి బంతినే స్టాండ్స్‌లో దింపిన హార్ధిక్ పాండ్యా, మ్యాచ్‌ని ముగించేశాడు. దీంతో మనోడి కాన్ఫిడెన్స్‌కి మెచ్చిన సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, తలవంచి ‘టేక్ ఏ బో’ అంటూ హార్ధిక్‌ని విష్ చేశాడు... ఈ ఏడాది హార్ధిక్ పాండ్యా అద్భుతంగా అదరగొడుతున్నా, అతనిలో ఈ మార్పు రావడానికి ఓ హిందీ షో కారణమంటున్నాడు భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా...

36

‘రెండేళ్ల క్రితం హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ఇద్దరూ కాఫీ తాగి వచ్చారు. ఆ షో (కాఫీ విత్ కరణ్)లో వీళ్లు చేసిన కామెంట్ల కారణంగా పెద్ద దుమారమే రేగింది. జనాలు, హార్ధిక్ పాండ్యాని తిట్టరాని తిట్లన్నీ తిట్టారు. అయితే ఈ వివాదం అతన్ని పూర్తిగా మార్చేసింది...

46

ఓ వ్యక్తిగా, ఓ ప్లేయర్‌గా మెచ్యూరిటీ సాధించడానికి కాఫీ విత్ కరణ్ షో కాంట్రవర్సీ చాలా ఉపయోగపడింది. తనని తాను సమీక్షించుకోవడానికి, తనపై వచ్చిన విమర్శలను ప్రశంసలుగా మలుచుకోవడానికి హార్ధిక్ పాండ్యా చాలా కష్టపడ్డాడు...

56
Hardik Pandya-KL Rahul

హార్ధిక్ పాండ్యా ఇన్ని రోజులు యుద్ధం చేసింది మనిషితో పాటు, తన ఎంజాయ్‌మెంట్‌తోనే. ఇప్పుడు తన ఎంజాయ్‌మెంట్‌ని వదిలేయలేదు, అయితే సక్రమంగా ఉంటూ లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకున్నాడు... ఆ వివాదం తర్వాత అతని బ్యాటింగ్, యాటిట్యూడ్ అన్నీ మారాయి... అతని జీవితంలో ఓ కొత్త ఫేజ్ తెరుచుకుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా...

66
Image credit: PTI

‘కాఫీ విత్ కరణ్’ షోకి తన స్నేహితుడు కెఎల్ రాహుల్‌తో కలిసి వెళ్లిన హార్ధిక్ పాండ్యా, ఆ షోలో ‘తాను సెక్స్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్లతో ‘ఈరోజు చేసి వచ్చా...’ అని చెబుతానంటూ’ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల కారణంగా పాండ్యా, కెఎల్ రాహుల్‌లపై ఓ మ్యాచ్ నిషేధం కూడా విధించింది బీసీసీఐ... 

click me!

Recommended Stories