డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్‌కి ఏమైంది... కుర్రాళ్ల కంటే దారుణంగా పరుగులు సమర్పిస్తూ...

Published : Jan 04, 2023, 09:47 AM IST

టీమిండియాలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా తక్కువ కాలంలోనే కీ బౌలర్‌గా మారిపోయాడు హర్షల్ పటేల్. ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేసిన హర్షల్ పటేల్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపికయ్యాడు. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..

PREV
17
డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్‌కి ఏమైంది... కుర్రాళ్ల కంటే దారుణంగా పరుగులు సమర్పిస్తూ...
Harshal Patel

హర్షల్ పటేల్‌కి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉంది. స్లో బాల్స్‌తో బ్యాటర్‌ని పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టడం హర్షల్ పటేల్ స్పెషాలిటీ. అయితే ఇప్పుడు ఇదే అతనికి భారంగా మారింది...

27
Harshal Patel

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు హర్షల్ పటేల్. 2 వికెట్లు తీసినా స్పిన్నర్లతో సమానంగా పరుగులు సమర్పించి యంగ్ బౌలర్లు శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ కంటే ఎక్కువ పరుగులు సమర్పించాడు...

37

32 ఏళ్ల హర్షల్ పటేల్, గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చినా ధారాళంగా పరుగులు సమర్పిస్తుండడంతో హర్షల్ పటేల్ కంటే అర్ష్‌దీప్ సింగ్‌ని ఆడించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది టీమిండియా...

47
Image credit: Getty

10+ ఎకానమీతో పరుగులు సమర్పించడం హర్షల్ పటేల్‌కి అలవాటుగా మారిపోయింది. గత 12 మ్యాచుల్లో 6 సార్లు 10+ ఎకానమీతో పరుగులు ఇచ్చిన హర్షల్ పటేల్, ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోతున్నాడు...
 

57

ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ మ్యాచ్‌కి చాలా కీలకం.  ఈ ఓవర్‌లో ఎన్ని తక్కువ పరుగులు ఇవ్వగలిగితే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం అంత ఎక్కువగా దొరుకుతుంది. భువనేశ్వర్ కుమార్‌ 19వ ఓవర్ వేస్తే, జస్ప్రిత్ బుమ్రా 20వ ఓవర్‌ని ముగించేవాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ లేకపోవడంతో హర్షల్ పటేల్‌పై ఈ బాధ్యత పెట్టింది టీమిండియా...

67

ఐపీఎల్ 2021 సీజన్‌లో, ఆ తర్వాతి మ్యాచుల్లో 19వ ఓవర్ వేసి టీమిండియాకి కీ బౌలర్‌గా మారిన హర్షల్ పటేల్, ఇప్పుడు తన రేంజ్ పర్ఫామెన్స్ చూపించలేకపోతున్నాడు.

77
Harshal Patel

గాయాలతో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో పదును తగ్గిందా? లేక అతని వీక్‌నెస్‌ని ప్రత్యర్థి బ్యాటర్లు కనిపెట్టేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది...

click me!

Recommended Stories