ఏబీపీ న్యూస్ తో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే హెడ్ కోచ్, సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత ఆసక్తులను పక్కనబెట్టి జట్టు గురించి ఆలోచించాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఇద్దరు ముగ్గురు ప్లేయర్ల మీద భారం వేసి వాళ్లను వరల్డ్ కప్ తీసుకురమ్మంటే అది జరగని పని...