GT vs RCB: అతడిని చూస్తే 2013లో ముంబై కెప్టెన్ గుర్తుకొస్తున్నాడు.. గుజరాత్ సారథిపై గవాస్కర్ ప్రశంసలు

Published : Apr 30, 2022, 05:04 PM IST

TATA IPL 2022 GT vs RCB: ఐపీఎల్-2022లో లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టేబుల్ టాపర్స్ గా నిలిచింది.  ఆ జట్టు ఇలా రాణించడానికి సారథి  హార్ధిక్ పాండ్యా కృషి ఎంతో ఉంది. 

PREV
110
GT vs RCB: అతడిని చూస్తే 2013లో ముంబై కెప్టెన్ గుర్తుకొస్తున్నాడు.. గుజరాత్ సారథిపై గవాస్కర్ ప్రశంసలు

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటివరకు 8 మ్యాచులాడిన  ఆ జట్టు.. ఏడింట్లో గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బ్రబోర్న్  వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గెలిస్తే  ఈ లీగ్ లో ప్లేఆఫ్స్ కు చేరుకున్న తొలి జట్టుగా గుర్తింపు దక్కించుకుంటుంది.

210

గుజరాత్ టైటాన్స్  లీగ్ లో ప్రవేశించినప్పుడు.. ‘అసలు ఈ జట్టు ప్లేఆఫ్స్ కు చేరితే గొప్ప.. అదీ కష్టమే..’అన్న విమర్శకుల నోళ్లకు తాళం వేస్తూ అనూహ్య ఆటతీరుతో అదరగొడుతున్న  ఈ జట్టు విజయాలలో సారథి  పాండ్యా  కృషి చాలా ఉంది. 

310

కెప్టెన్ గానే గాక  కీలక బ్యాటర్ గా కూడా పాండ్యా అద్భుత పరిణితితో కూడిన ఆటతీరును ప్రదర్శిస్తూ అందరి  ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో  భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్  పాండ్యా పై ప్రశంసలు కురిపించాడు. పాండ్యాను చూస్తే  2013లో ముంబై సారథి రోహిత్ శర్మను చూసినట్టు అనిపిస్తుందని తెలిపాడు. 

410

గవాస్కర్ మాట్లాడుతూ... ‘పాండ్యా ను చూస్తుంటే 2013లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ను చూసినట్టు అనిపిస్తున్నది.  సారథిగా రాగానే అతడిలో బాధ్యత పెరిగింది.  నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. 
 

510

కెప్టెన్సీ అయ్యాక రోహిత్ షాట్ సెలెక్షన్ కూడా మారింది.  అప్పటిదాకా  చెత్త షాట్లకు వికెట్ ను పారేసుకున్న రోహిత్.. ఆ తర్వాత   మాత్రం బాధ్యతగా ఆడాడు. ఇప్పుడు హార్ధిక్ ను చూసినా అలాగే అనిపిస్తున్నది.   ఈ ఐపీఎల్ లో పాండ్యా షాట్ సెలెక్షన్ చాలా బాగుంది. 

610

అంతేగాక అతడి ఫీల్డింగ్ కూడా  ఆకట్టుకుంటున్నది. రోహిత్ కూడా కవర్స్,  సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేసేప్పుడు చూడటానికి బాగుంటుంది.  అదే నైపుణ్యం ఇప్పుడు పాండ్యా లో కూడా చూస్తున్నాను. అందుకే గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలు సాధిస్తున్నది..’ అని చెప్పుకొచ్చాడు. 

710

టీమిండియా వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. అతడు గతంలో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడని, కానీ ఇప్పుడు 3, 4 స్థానాలలో రావడం వల్ల  అతడి బ్యాటింగ్ కూడా మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. 

810

‘పాండ్యా ఆటను గమనిస్తే చాలా నియంత్రణగా ఆడుతన్నట్టు కనిపిస్తున్నది. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి చివరిదాకా క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. చివరిదాకా ఉంటే మ్యాచ్ ఫలితం మార్చగల శక్తి అతడికుంది. ముందు  నెమ్మదిగా ఆడినా  తర్వాత మాత్రం పాండ్యా వీరవిహారం చేసి తన స్ట్రైక్ రేట్ ను పెంచుకుంటున్నాడు. 

910

పాండ్యా  కవర్ డ్రైవ్ లతో పాటు పుల్ షాట్స్ కూడా బాగా ఆడుతున్నాడు. పేసర్లతో పాటు స్పిన్నర్లను కూడా ధీటుగా ఎదురుకుంటున్నాడు...’అని చావ్లా చెప్పుకొచ్చాడు. 

1010

ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఏడు మ్యాచుల్లో 305 పరుగులు చేశాడు పాండ్యా. బౌలర్ గా నాలుగు వికెట్లు కూడా తీశాడు. ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో పాండ్యా.. నాలుగో స్థానంలో ఉన్నాడు.  బ్యాటర్ గానే గాక  సారథిగా కూడా అతడు తనదైన వ్యూహాలతో రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆ జట్టును ఓడించింది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. 

Read more Photos on
click me!

Recommended Stories