IPL 2022: ‘కింగ్ ఈజ్ బ్యాక్’... టైటాన్స్‌పై విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ...

Published : Apr 30, 2022, 04:47 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో తన ఫామ్ గురించి జరిగిన చర్చలకు, వచ్చిన విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెప్పాడు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... రెండు రనౌట్లు, రెండు గోల్డెన్ డకౌట్స్, ఓ సింగిల్ డిజిట్ స్కోరు తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ...

PREV
17
IPL 2022: ‘కింగ్ ఈజ్ బ్యాక్’... టైటాన్స్‌పై విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ...

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ, మొదటి ఓవర్ నుంచి క్రీజులో చాలా కాన్ఫిడెంట్‌గా కదిలాడు... తన యాటిట్యూడ్‌పై వచ్చిన ట్రోల్స్‌ని తన బ్యాటుతో సమాధానం చెప్పాడు...
 

27

రెండో ఓవర్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ డకౌట్ కావడంతో 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తీసుకున్న విరాట్, యంగ్ ప్లేయర్ రజత్ పటిదార్‌తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

37

అల్జెరీ జోసఫ్ వేసిన 5వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, ఫర్గూసన్ వేసిన 10వ ఓవర్‌లో ఓ సిక్సర్, ఫోర్ బాదాడు.. 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ...

47

ఐపీఎల్‌లో 15 ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ కోహ్లీ చేసిన మొట్టమొదటి హాఫ్ సెంచరీ ఇదే. ఇంతకుముందు 2009-10 సీజన్ల మధ్య హాఫ్ సెంచరీ చేయడానికి 18 ఇన్నింగ్స్‌ల గ్యాప్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ...

57

ఐపీఎల్ కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది 43వ హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన రెండు సిక్సర్లతో టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రెండో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ...

67

రోహిత్ శర్మ టీ20 కెరీర్‌లో 429 సిక్సర్లతో టాప్‌లో నిలవగా, భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ 326 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా 325 సిక్సర్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు.

77

మరో ఎండ్‌ల్ వన్‌డౌన్‌లో వచ్చిన రజత్ పటిదార్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పటిదార్‌కి ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ...

Read more Photos on
click me!

Recommended Stories