విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఆ పని చేయలేదు... టీమిండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా అనుష్కతో కలిసి...

Published : Apr 30, 2022, 04:25 PM IST

ఎమ్మెస్ ధోనీ నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న విరాట్ కోహ్లీ, భారత జట్టు రిజర్వు బెంచ్‌ని మునుపెన్నడూ లేనంత పటిష్టంగా మార్చేశారు. బ్రిస్బేన్ టెస్టులో దాదాపు అరడజను మంది మెయిన్ ప్లేయర్లు అందుబాటులో లేకపోయినా భారత జట్టు, ఆసీస్‌ను మట్టికరిపించిందంటే దానికి కారణం కోహ్లీయే...

PREV
18
విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఆ పని చేయలేదు... టీమిండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా అనుష్కతో కలిసి...

విదేశీ పిచ్‌లపై 20 వికెట్లు తీయగలిగేలా భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు చాలా కష్టపడ్డి, అందులో సూపర్ సక్సెస్ అయ్యాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...

28

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ వంటి పేసర్లు... భారత జట్టు తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు...

38
Virat Kohli, Ravi Shastri

‘ఫారిన్ టూర్లకు వెళ్లినప్పుడు బిజినెస్ క్లాస్‌లో రెండు సీట్లు రిజర్వు చేస్తారు. ఒకటి కెప్టెన్ కోసం, మరొకరి హెడ్ కోచ్ కోసం... అయితే విరాట్ కోహ్లీ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం నేనెప్పుడూ చూడలేదు...

48
Team India

అతను ఎప్పుడూ తన టీమ్‌ మేట్స్‌తో కలిసి ఎకనామిక్ క్లాస్‌లో ప్రయాణించడానికే ప్రాధాన్యం ఇస్తాడు. బిజినెస్ క్లాస్‌లో హెడ్ కోచ్‌తో పాటు బౌలర్లను పంపిస్తాడు...

58

ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ... లేదా రవిచంద్రన్ అశ్విన్... ఇలా ఏదో ఓ బౌలర్, బిజినెస్ క్లాస్‌లో విరాట్ సీట్‌లో కూర్చొని ప్రయాణం చేశారు...

68

మ్యాచ్‌ని గెలిపించడానికి బౌలర్లు చాలా కష్టపడతారు. కనీసం రెండు మూడు గంటలైనా వారికి సరైన విశ్రాంతి లభించాలని విరాట్ కోహ్లీ భావించేవాడు... అందుకే తన సీట్‌ని వాళ్లకి ఇచ్చేవాడు...

78

2019 వెస్టిండీస్ టూర్‌లో అనుష్క శర్మ కూడా టీమిండియాతో కలిసి ప్రయాణం చేసింది. అప్పుడు కూడా విరాట్, అనుష్క ఇద్దరూ కలిసి ఎకనామిక్ క్లాస్‌లో ప్రయాణం చేశారు.

88

విరాట్ ఎప్పుడూ అనుష్కకి బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వాలని కోరింది లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ వివేక్ రాజ్‌దాన్... 

Read more Photos on
click me!

Recommended Stories