Champions Trophyలో భారత్ vs పాకిస్తాన్ ఆడిన చివరి మ్యాచ్ లో ఏం జరిగింది?

Published : Feb 22, 2025, 05:47 PM ISTUpdated : Feb 22, 2025, 06:01 PM IST

Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్ vs పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భార‌త్-పాకిస్తాన్ లు 2017 ఫైనల్‌లో త‌ల‌ప‌డ్డాయి. అయితే, ఆ మ్యాచ్ లో ఏం జ‌రిగింది.  

PREV
15
Champions Trophyలో భారత్ vs పాకిస్తాన్ ఆడిన చివరి మ్యాచ్ లో ఏం జరిగింది?
Image Credit: Getty Images

Champions Trophy: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో మ‌రో కీల‌క ఘ‌ట్టానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. చాలా కాలంగా క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొద‌లైంది. అదే భార‌త్, పాకిస్తాన్ మ్యాచ్. ఫిబ్రవరి 23న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరగ‌నుంది.

25
Image Credit: Getty Images

దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భారత్ బలమైన ఆరంభం చేసింది. 129 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచిన శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

మరోవైపు, పాకిస్తాన్ తన మొదటి గ్రూప్ దశ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో పాక్ 60 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ పెద్ద‌గా ప‌రుగ‌లు చేయకుండానే పెవిలియ‌న్ బాట‌ప‌డ్డారు. ఈ ఐసీసీ టోర్నీలో పాక్ ఇంకా కొన‌సాగాలంటే భారత్‌తో జ‌రిగే మ్యాచ్ లో గెల‌వాలి. లేకుండా ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 నుంచి ఔట్ అవుతుంది. అయితే, చివ‌రిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ లో ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

35
Image Credit: Getty Images

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చివరిసారిగా పాకిస్థాన్‌తో 2017 ఎడిషన్ ఫైనల్‌లో త‌ల‌ప‌డింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఫఖర్ జమాన్ అద్భుతమైన సెంచరీతో భారీ స్కోర్ చేసింది. ఫ‌ఖ‌ర్ 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. అజార్ అలీతో కలిసి 128 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరికి తోడుగా మొహమ్మద్ హఫీజ్ 37 బంతుల్లో 57 పరుగులు చేసి పాకిస్తాన్ స్కోర్ బోర్డును 338 పరుగులకు చేర్చాడు.

సర్ఫరాజ్  అహ్మద్ కెప్టెన్సీలోని పాకిస్తాన్ జట్టులో అజార్ అలీ 59 పరుగులు, ఫఖర్ జమాన్ 114 పరుగులు, బాబార్ ఆజం 46 పరుగులు, మహ్మద్ హఫీజ్ 57 పరుగుల ఇన్నింగ్స్ లతో  పాకిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 338 పరుగులు చేసింది. 

45
Image Credit: Getty Images

భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త్ కు మంచి ఆరంభం ల‌భించ‌లేదు. 33 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. పాకిస్తాన్ తరపున మహ్మద్ అమీర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ భార‌త్ ను దెబ్బ‌కొట్టాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు ప్లేయర్లు అలా వచ్చి ఇలా పెవిలియన్ బాటపట్టారు.

రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. శిఖర్ ధావన్ 21, విరాట్ కోహ్లీ 5, యువరాజ్ సింగ్ 22, ఎంఎస్ ధోని 4, కేదార్ జాదవ్ 9, రవీంద్ర  జడేజా 15 పరుగులు మాత్రమే చేశారు. 

 

55
Image Credit: Getty Images

ఒక వైపు వికెట్లు పడుతుంటే మరో ఎండ్ లో మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉన్న హర్దిక్  పాండ్యా 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు కానీ, ఇతర ప్లేయర్ల నుంచి అతనికి సపోర్టు లభించలేదు. భారత జట్టు 30.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌట్ అయింది.

దీంతో 180 పరుగుల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. పాక్ బౌలర్లలో అమీర్ 3, హసన్ అలీ 3, షాదాబ్ ఖాన్ 2, జునైద్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫఖర్ జమాన్ నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా హసన్ అలీ, బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్ గా శిఖర్ ధావన్ నిలిచాడు. అప్పటి మ్యాచ్ కు ఇప్పుడు దుబాయ్ లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories