IND vs PAK: గిల్ vs బాబర్: దుమ్ము రేపేది ఎవరబ్బా?

Published : Feb 22, 2025, 01:46 PM ISTUpdated : Feb 22, 2025, 01:56 PM IST

India vs Pakistan Shubman Gill vs Babar Azam: ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజీ మ్యాచ్ లో ఇండియా-పాకిస్తాన్ లు ఆదివారం తలపడనున్నాయి. శుభ్ మన్ గిల్, బాబర్ ఆజం పై భారీ అంచనాలున్నాయి. మరి వీరిద్దరిలో దుమ్ము రేపేది ఎవరబ్బా?

PREV
14
IND vs PAK: గిల్ vs బాబర్: దుమ్ము రేపేది ఎవరబ్బా?
Shubman Gill vs Babar Azam

ఛాంపియన్స్ ట్రోఫీ దాయాది పోరుకు రంగం సిద్దమైంది. పాకిస్తాన్, దుబాయ్ లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు జరిగాయి. భారత్ తన తొలి మ్యాచ్ ను విజయంతో టోర్నీని ప్రారంభించింది. తన రెండో మ్యాచ్ లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇండియా, పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు తమ ఆటతో ఫ్యాన్స్ ని అలరించడానికి రెడీగా ఉన్నారు.

ఇండియన్ టీమ్ విషయానికొస్తే, మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇండియా మీద గెలిస్తేనే సెమీ ఫైనల్స్ గురించి ఆలోచించగలదు. ఓడిపోతే టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. జరగబోయే మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, బాబర్ ఆజం పై భారీ అంచనాలున్నాయి. మరీ వీరిద్దరిలో దుమ్ము రేపేది ఎవరబ్బా?

24
Shubman Gill (Photo: X/@BCCI)

శుభ్ మన్ గిల్ పాక్ ను గిల్లేస్తాడా? 

రెండు టీమ్ లలో ఎప్పుడైనా మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్లు ఉన్నారు. ఇండియన్ క్రికెట్ ప్రిన్స్ శుభ్ మన్ గిల్, పాకిస్తాన్ సూపర్ స్టార్ బాబర్ ఆజంలు దాయాది పోరులో ప్రత్యేకంగా నిలుస్తారు. గిల్ విషయానికొస్తే, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి తన సత్తా చాటాడు. వన్డే సిరీస్ అంటే గిల్ ఫుల్ జోష్ లో ఉంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేసి 249 రన్స్ కొట్టాడు. లాస్ట్ 5 వన్డే మ్యాచ్ లలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 51 మ్యాచ్లు ఆడిన గిల్ 62.51 యావరేజ్ తో 2688 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

34
Image Credit: Getty Images

పాకిస్తాన్ సూపర్ స్టార్ బాబర్ ఆజం ఏం చేస్తాడో మరి?

ఇక బాబర్ ఆజమ్ విషయానికొస్తే, ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్ మెన్ లలో ఒకడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీతో పోలుస్తారు. బాబర్ ఆజమ్ రీసెంట్ గా వన్డే ఫార్మాట్ లో రన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ ట్రై సిరీస్ లో 4 మ్యాచ్ లలో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 64 రన్స్ చేసి ఫామ్ లోకి వచ్చాడు.

44
Shubman Gill-Babar Azam

గిల్ vs బాబర్: దుమ్ము రేపేది ఎవరు?

బాబర్ ఆజం మొత్తంగా 127 వన్డే మ్యాచ్ లలో 19 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 6083 రన్స్ చేశాడు. ఇండియా మీద గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ కల నెరవేరాలంటే బాబర్ ఆజమ్ బ్యాట్ ఆడాలి. గిల్, బాబర్ ఇద్దరూ ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ రెండింటినీ బాగా ఆడగలరు. ఇంకా ఇద్దరి షాట్స్ చూడటానికి చాలా బాగుంటాయి. రేపటి మ్యాచ్ లో దుమ్ము రేపేది ఇండియన్ యువరాజా? లేక పాకిస్తాన్ సూపర్ స్టారా? వేచి చూద్దాం.

Read more Photos on
click me!

Recommended Stories