టీమిండియాపై గెలవడం కష్టమే, కానీ మమ్మల్ని ఓడించడమూ తేలిక కాదు... - విండీస్ కోచ్ బ్రియాన్ లారా

Published : Jul 10, 2023, 01:23 PM IST

రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టు, 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. వరుస పరాజయాలతో నేరుగా వరల్డ్ కప్‌కి క్వాలిఫై కాలేకపోయిన విండీస్, క్వాలిఫైయర్స్‌లో శ్రీలంక, జింబాబ్వే, స్కాట్లాండ్ చేతుల్లో ఓడి... ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది..

PREV
16
టీమిండియాపై గెలవడం కష్టమే, కానీ మమ్మల్ని ఓడించడమూ తేలిక కాదు... - విండీస్ కోచ్ బ్రియాన్ లారా
West Indies

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్ ముగిసిన తర్వాత జూలై 12 నుంచి టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడనుంది వెస్టిండీస్. డొమినికాలో తొలి టెస్టు జరగబోతుంటే, రెండు టెస్టుల సిరీస్ తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడతాయి ఇండియా- వెస్టిండీస్..

26

‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సీజన్‌‌ మొదట్లోనే ఇండియాతో రెండు కీలకమైన టెస్టులు ఆడుతుంది. ఇండియా టాప్ టీమ్. స్వదేశంలో అయినా విదేశంలో అయినా వారిని ఓడించడం చాలా కష్టం.. అయితే మా అడ్డాలో మమ్మల్ని ఓడించడం కూడా అంత తేలికైన విషయం కాదు..

36

టెస్టుల్లో వెస్టిండీస్ ప్రయాణం సరైన దిశలోనే సాగుతుందని నా అభిప్రాయం. క్యాంపు బాగా సాగింది. క్రెగ్ బ్రెత్‌వైట్ కెప్టెన్సీలో కుర్రాళ్లకు ఇది చాలా చక్కని అవకాశం. టీమిండియాతో టెస్టు సిరీస్‌లో వాళ్లు ఎన్నో విషయలు నేర్చుకోవచ్చు..

46
Team india vs West Indies

ఫస్ట్ క్లాస్‌లో ఎంతో అనుభవం ఉన్న కుర్రాళ్లను ఏరికోరి ఈ టెస్టు సిరీస్ కోసం తీసుకున్నాం. వారి ఆటతీరు, యాటిట్యూడ్ చూస్తుంటే నాకు భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వాళ్లు సరిగ్గా వాడుకుని, టీమ్‌కి విజయాలు అందిస్తారని అనుకుంటున్నా..

56

అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాగానే అద్భుతాలు చేయాలని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. సెటిల్ కావడానికి వాళ్లకి కాస్త సమయం కావాలి. కుర్రాళ్లలో నేర్చుకోవాలనే తపన చూశాను. అది చాలు, వాళ్లు మ్యాచ్ విన్నర్లుగా మారడానికి...’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కోచ్ బ్రియాన్ లారా.. 
 

66
India vs West Indies

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో వెస్టిండీస్ ఘోర పరాభవాల తర్వాత ఆ టీమ్ కోచింగ్ స్టాఫ్‌లో చేరిన బ్రియాన్ లారా, టీమ్‌కి పూర్వ వైభవం అందించాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు.. 

click me!

Recommended Stories