రోహిత్ నుంచి ఎంతో ఆశించా! ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచి ఏం లాభం... మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్స్..

Published : Jul 10, 2023, 12:11 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. అప్పటికే రెండేళ్ల నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తూ వచ్చాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మకు ఇవ్వకుండా విరాట్‌ని కెప్టెన్‌గా కొనసాగించడాన్ని తప్పుబట్టారు చాలామంది..

PREV
19
రోహిత్ నుంచి ఎంతో ఆశించా! ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచి ఏం లాభం... మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్స్..
Rohit Sharma

8 సీజన్లలో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ ఉండగా, 9 సీజన్లలో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా అందించలేకపోయిన విరాట్ కోహ్లీని కొనసాగించడం కరెక్ట్ కాదని కామెంట్ చేసిన వారిలో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు...
 

29

అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా... ఒక్క గొప్ప విజయం కూడా అందించలేకపోయాడు. రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్ చేరిన టీమిండియా, 2023 టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఓడింది. ఆసియా కప్ 2023 టోర్నీలోనూ సూపర్ 6 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టింది..

39

‘రోహిత్ శర్మ నుంచి నేను ఎంతో ఆశించా. ఇండియాలో మ్యాచులు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ విదేశాల్లోనే అసలైన పరీక్ష. ఆ విషయంలో రోహిత్ నన్ను తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ఫార్మాట్‌లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో చెప్పుకోదగ్గ విజయాలు రాకపోవడం నన్ను డిస్సప్పాయింట్ చేసింది..
 

49

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఐదు టైటిల్స్ గెలిచాడు. కెప్టెన్‌గా వందల మ్యాచులు ఆడాడు. ఏ మాత్రం అనుభవం లేని ప్లేయర్లతో ఎలా గెలవాలో కూడా చూపించాడు. టీమిండియా విషయానికి వచ్చే సరికి ఎంతో అనుభవం ఉన్న బెస్ట్ ప్లేయర్లతో సరైన విజాలు అందుకోలేకపోయాడు..

59
Image credit: Getty

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా 3 నెలల సమయం కూడా లేదు. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనకి వెళ్లారు. అంతకుముందు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు ఏమైనా టెస్టులు ఆడారా? ఆ మ్యాచ్‌లో ఓడిన తర్వాత కనీసం 25 రోజుల సమయం కావాలని అన్నాడు..

69

ప్రిపరేషన్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వే కెప్టెన్‌ని అనే విషయం మరిచిపోకు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవడం ముఖ్యం అనుకుంటే ఐపీఎల్‌లో కొన్ని మ్యాచులు ఆడకుండా, ముందుగానే వెళ్లి... వార్మప్ మ్యాచులు ఆడలేవా? కీలక ప్లేయర్లు కావాలని అడిగితే, ఫ్రాంఛైజీలు లేదని అంటాయా?

79
Rohit Sharma

నిజం ఏంటంటే నీకు కూడా ఐపీఎల్ వదిలి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే ఐపీఎల్ వదిలితే ఎంత డబ్బు మిస్ అవుతుందో నీకు బాగా తెలుసు. వర్క్ లోడ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ముందు నువ్వు ఫిట్‌గా ఉన్నావా? లేదా? అనేది చూసుకోవాలి...

89
Rohit Sharma-Gill


చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటే వారిని భరించాల్సిన అవసరం టీమిండియాకి లేదు. సీనియర్ అయినా జూనియర్ అయినా ఇంప్రూమెంట్ చూపించాలి. వీరేంద్ర సెహ్వాగ్‌ని టీమ్ నుంచి తప్పించడానికి పెద్దగా సమయం పట్టలేదు. కొన్ని మ్యాచుల్లో ఫెయిల్ అవ్వగానే అతన్ని పిలిచి హెచ్చరించా..

99
Rahul Dravid-Rohit Sharma

ఫుట్‌వర్క్ ఇంప్రూవ్ చేసుకొమ్మని సూచించా. అతని బ్యాటింగ్‌లో ఎక్కడ లోపం జరుగుతుందో క్లియర్‌గా వివరించా. అది కోచ్‌గా చేయాల్సింది. అయితే సెహ్వాగ్ నా సూచనలకు పెద్దగా విలువ ఇవ్వలేదు. కొన్నాళ్లకే టీమ్‌లో ప్లేస్ కోల్పోయాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

Read more Photos on
click me!

Recommended Stories