పాకిస్తాన్‌ ప్లేస్‌లో వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీకి స్కాట్లాండ్!? రోజుకో మాట మారుస్తున్న పాకిస్తాన్...

Published : Jul 10, 2023, 12:47 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి లింక్ పెడుతున్న పాకిస్తాన్, టీమిండియాకి వస్తుందా? లేదా? అనే విషయం గురించి నాన్చుతూనే ఉంది. ఆసియా కప్‌ కోసం టీమిండియా, పాకిస్తాన్‌కి వెళ్లడానికి అంగీకరించకపోవడంతో వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీ కోసం పాక్, ఇండియాకి వెళ్లకూడదని భావిస్తోంది..

PREV
15
పాకిస్తాన్‌ ప్లేస్‌లో వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీకి స్కాట్లాండ్!? రోజుకో మాట మారుస్తున్న పాకిస్తాన్...

షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్‌తో జరగాల్సి ఉంది. అయితే ఇండియా, పాకిస్తాన్‌లో పర్యటించేందుకు అంగీకరించకపోవడంతో ఎన్నో తర్జనభర్జనల తర్వాత హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
 

25
India vs Pakistan

ఈ నిర్ణయం ప్రకారం పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచులు జరగబోతుంటే, మిగిలిన 9 మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రస్తుత పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని, కాబోయే పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ జకా అస్రఫ్ తప్పుబట్టాడు. ఈ హైబ్రీడ్ మోడల్ వల్ల పాకిస్తాన్‌కి ఒరిగేదేమీ లేదన్నాడు..

35
India vs Pakistan

అలాగే పాకిస్తాన్‌కి టీమిండియా రాకపోతే, పాక్ టీమ్‌ని కూడా భారత్‌కి పంపేది లేదని వాదిస్తున్నాడు జకా అస్రఫ్. నజం సేథీకి ముందు పీసీబీ ఛైర్మెన్‌గా ఉన్న రమీజ్ రజా కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించాడు. ఏడాదిలో పీసీబీకి ముగ్గురు ఛైర్మెన్‌లు మారడం, తలా ఓ మాట చెబుతుండడంతో ఇండియాకి పాక్ టీమ్‌ని పంపాలా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు పాక్ ప్రభుత్వం, ఓ కమిటీని నియమించనుంది.

45

ఈ కమిటీ సభ్యులు, ఇండియాలో పర్యటించి, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాల్గొనేది? లేనేది? తేల్చబోతున్నారు. పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడడం కోసం రోజుకో కొత్త డ్రామా ఆడుతుండడంతో ఒకవేళ పాక్ హ్యాండ్ ఇస్తే స్కాట్లాండ్‌ని, ఆ ప్లేస్‌లో ఆడించాలని నిర్ణయం తీసుకుంది ఐసీసీ..

55

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌‌‌లో  శ్రీలంక, నెదర్లాండ్స్ టాప్ 2లో నిలిచి, ఇండియాలో ప్రపంచ కప్‌ ఆడబోతుంటే స్కాట్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ హ్యాండ్ ఇస్తే.. వెస్టిండీస్, జింబాబ్వేలపై విజయాలు అందుకున్న స్కాట్లాండ్‌కి లక్కీ ఛాన్స్ దొరకనుంది.. 

click me!

Recommended Stories