ఇమ్రాన్ ఖాన్ నన్ను నైట్ క్లబ్‌కు తీసుకెళ్లాడు.. అమ్మాయిలంతా చూస్తుండగానే.. వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్

Published : Nov 25, 2022, 12:25 PM IST

పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ లు   ఆ దేశానికి 1992లో వన్డే ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు.  ఇమ్రాన్ సారథ్యంలోనే  వసీం  కెరీర్ స్టార్ట్ అయింది.  

PREV
16
ఇమ్రాన్ ఖాన్ నన్ను నైట్ క్లబ్‌కు తీసుకెళ్లాడు.. అమ్మాయిలంతా చూస్తుండగానే.. వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్

క్రికెట్ లో ఆటగాళ్లు  తాము ఆడేప్పుడు  చేసే చిలిపి పనులు, జ్ఞాపకాలను చాలా కాలం తర్వాత రివీల్ చేస్తారు. ఒక పుస్తకంలోనో లేదా ఏదో ఒక కార్యక్రమంలోనో తమ అనుభూతులను పంచుకుంటారు.  క్రికెటర్లుగా ఉన్నప్పుడు వాళ్లు చేసే పనులను తర్వాత  తలుచుకుని  ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. 
 

26

తాజాగా పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ కూడా  తాను క్రికెట్  కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో చేసిన చిలిపి పనులను  పంచుకున్నాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ సారథి  ఇమ్రాన్ ఖాన్ తో కలిసి  అక్రమ్ ఇంగ్లాండ్ లో నైట్ క్లబ్ కు వెళ్లాడంట..

36

‘ది గ్రేడ్ క్రికెటర్’ అనే కార్యక్రమంలో అక్రమ్  మాట్లాడుతూ.. ‘ఆ ఘటనను తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు ఆగదు.  నేను అప్పుడు చాలా యంగ్ గా ఉన్నాను. అప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఓసారి మేం ఇంగ్లాండ్  టూర్ కు వెళ్లినప్పుడు అప్పటి సారథి ఇమ్రాన్ ఖాన్  నన్ను తన గదికి పిలిచి నైట్ పార్టీకి వెళ్దాం  రెడీ అవ్వు అన్నాడు. 

46

నేను దానికి సరేనని వెళ్లాను. మేమిద్దరం లండన్ లోని కింగ్స్ క్రాస్  నై్ క్లబ్ కు వెళ్లాం. ఆ క్లబ్ లోపలికి వెళ్లగానే అక్కడ అందరూ  ఇమ్రాన్ ను గుర్తు పడుతున్నారు.  లోపల ఉన్న చాలా మంది అమ్మాయిలు ఇమ్రాన్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అదంతా నాకు వింతలా తోచింది. 

56

తర్వాత కొంతసేపటికి  ఇమ్రాన్ ఖాన్  తనతో పాటు నాక్కూడా కొన్ని పాలు  ఆర్డర్ చేశాడు.  తన లైఫ్ లో ఇమ్రాన్ ఖాన్ అప్పటివరకు పాలు తాగలేదట.    నైట్ క్లబ్ కు వెళ్లి మేమిద్దం పాలు తాగి వచ్చాం..’ అంటూ అప్పటి ఫన్నీ ఘటనను  గుర్తుచేసుకుని నవ్వులు  పూయించాడు అక్రమ్. 

66

1992లో వన్డే ప్రపంచకప్ నెగ్గాక ఇమ్రాన్ ఖాన్ 1996లో పాకిస్తాన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాడు.  సుమారు రెండు దశాబ్దాల తర్వాత  (2018లో)  ఇమ్రాన్ ఖాన్  పాకిస్తాన్ ప్రధాని అయ్యారు. కానీ ఈ ఏడాది దేశంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా  ఆయన తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. వసీం అక్రమ్  క్రికెట్ నుంచి రిటైరయ్యాక కామెంటేటర్ గా కొనసాగుతున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories