నాకూ ఇలాగే అన్యాయం జరిగింది, రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి... సంజూ శాంసన్‌పై మనీశ్ పాండే కామెంట్...

First Published Nov 25, 2022, 11:23 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడంపై తీవ్ర దుమారం రేగింది. కనీసం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అయినా శాంసన్‌ని ఆడిస్తారని అనుకుంటే అది కూడా జరగలేదు. వచ్చిన అరకోర అవకాశాలను అద్భుతంగా వాడుకుంటున్నా సంజూ శాంసన్‌కి వరుస అవకాశాలు రాకపోవడం, బీసీసీఐపై తీవ్ర విమర్శలు రావడానికి కారణమవుతోంది...

Sanju Samson - Rishabh Pant

రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతూ వస్తున్నా అతనికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న టీమిండియా.. సంజూ శాంసన్‌ని మీద రిజర్వు బెంచ్‌ మీదే కూర్చోబెడుతోంది. సంజూ శాంసన్, సౌత్ ఇండియాకి చెందినవాడు కావడం వల్లే అతనిపై వివక్ష చూపిస్తున్నారని ట్రోల్స్ వస్తున్నాయి...

తాజాగా కర్ణాటక ప్లేయర్, టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే దీనిపై స్పందించాడు. ‘భారత జట్టులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేశాను. నేను ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ... రిజర్వు బెంచ్‌లో ఖాళీగా కూర్చుంటే చాలా బాధగా ఉంటుంది...

టీమ్‌లో ఉన్నవారి కంటే మనం తక్కువ అనే ఫీలింగ్ కలుగుంది. అయితే ఈ విషయంలో క్రీడా స్ఫూర్తి చాలా అవసరం, టీమ్‌కి ఎవరు అవసరమో కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తారు... అంతే తప్ప! మనం తక్కువా? వాళ్లు ఎక్కువా అని కాదు...

మన టైం వచ్చేదాకా వేచి చూడాలంతే. అయితే జట్టులో ప్లేస్ రాకపోయినా, రిజర్వు బెంచ్‌లో కూర్చున్నా అది మన ఆటపై ప్రభావం చూపించకుండా చూసుకోవాలి.. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నాకు వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడాలని తాపత్రయపడ్డాను. ఇప్పుడు సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడుతున్నాడు.  తను కూడా ఇదే మైండ్‌సెట్‌తో ఉంటే బెటర్. 

Sanju Samson

ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నాకు వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడాలని తాపత్రయపడ్డాను. ఇప్పుడు సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడుతున్నాడు.  తను కూడా ఇదే మైండ్‌సెట్‌తో ఉంటే బెటర్. 

అవకాశం వచ్చినప్పుడు ఆడితే, టీమ్‌లో ప్లేస్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు... సంజూ శాంసన్ వచ్చాక నాకు టీమ్‌లో దొరకకడం బాధ కలిగించలేదు.. త్వరలోనే టీమ్‌లో ప్లేస్‌ని తిరిగి సంపాదించుకుంటాననే నమ్మకం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు మనీశ్ పాండే...

Manish Pandey

ఐపీఎల్ 2009లో సెంచరీ చేసిన మనీశ్ పాండే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శతకం బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. సెంచరీ చేసిన ఆరేళ్లకు 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మనీశ్ పాండే... టీమిండియా తరుపున 29 వన్డేలు, 39 టీ20 మ్యాచులు ఆడాడు...

click me!