శ్రేయాస్ అయ్యర్, టీమ్‌లో ఉండాలంటే అదొక్కటే గతి... న్యూజిలాండ్ మాజీ బౌలర్ కామెంట్...

Published : Nov 24, 2022, 07:18 PM IST

ఒక్క గాయం... శ్రేయాస్ అయ్యర్ క్రికెట్ కెరీర్‌ని తలకిందులు చేసేసింది. 2021 ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో డైవ్ చేసి క్యాచ్ అందుకోబోయి గాయపడిన శ్రేయాస్ అయ్యర్... నాలుగు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమయ్యాడు. ఈ టైమ్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమ్‌లోకి వచ్చి, నాలుగో స్థానానికి తానే కరెక్ట్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. దెబ్బకి అయ్యర్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది...

PREV
17
శ్రేయాస్ అయ్యర్, టీమ్‌లో ఉండాలంటే అదొక్కటే గతి... న్యూజిలాండ్ మాజీ బౌలర్ కామెంట్...
Sanju Samson-Shreyas Iyer

ఢిల్లీ క్యాపిటల్స్‌ని మొట్టమొదటిసారిగా ఫైనల్ చేర్చిన సారథి శ్రేయాస్ అయ్యర్. గౌతమ్ గంభీర్ లాంటి మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ వల్ల కూడా కానిది, అయ్యర్ చేసి చూపించాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో ఐపీఎల్‌లో రిషబ్ పంత్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొంది, టీమ్ మేనేజ్‌మెంట్‌ని మెప్పించి... ఆ పొజిషన్‌ని కొట్టేశాడు. దీంతో అయ్యర్, కెప్టెన్సీ కోసం టీమ్ మారాల్సి వచ్చింది. 

27
Shreyas Iyer-Shubman Gill

గాయానికి ముందు టీమిండియాలో నాలుగో స్థానంలో సరైన ప్లేయర్‌గా నిరూపించుకున్న శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు సారథిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గాయం తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాడు.

37

టీమిండియా తర్వాతి కెప్టెన్ అవుతాడని అనుకున్న శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు టాప్ 3లో కూడా లేడు. కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్... ఇలా యంగ్ ప్లేయర్లు టీమిండియా తర్వాతి కెప్టెన్ల రేసులో ఉంటే... అయ్యర్, తుది జట్టులో చోటు దక్కితే చాలనుకునే పరిస్థితికి చేరుకున్నాడు.

47
Image credit: PTI

దీంతో శ్రేయాస్ అయ్యర్ తుదిజట్టులో చోటు దక్కించుకునేందుకు కష్టపడాల్సిన పరిస్థితి. అదీగాక షార్ట్ బాల్‌ను ఎదుర్కోవడంలో తెగ ఇబ్బందిపడుతున్న అయ్యర్, టీ20ల్లో వరుసగా విఫలమవుతున్నాడు. అయ్యర్‌ని అవుట్ చేయడం ఇప్పుడు బౌలర్లకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేని ఈజీ ప్రశ్నగా మారిపోయింది...

57
Image credit: PTI

‘హార్ధిక్ పాండ్యా గాయపడితే అతని ప్లేస్‌ని భర్తీ చేసే ఆల్‌రౌండర్ కనిపించడం లేదు. శార్దూల్ ఠాకూర్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో బాగా ఆడాడు. అయితే ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు టీమిండియాకి బౌలింగ్ ఆల్‌రౌండర్లు కాదు, బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు కావాలి..
 

67
Image credit: PTI

బ్యాటింగ్ చేస్తూ అవసరమైన సమయాల్లో వికెట్లు తీయగలిగాలి. శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ లేదా సూర్యకుమార్ యాదవ్ రెస్ట్ తీసుకుంటేనే అయ్యర్‌కి అవకాశం వస్తోంది. అతను బౌలింగ్ నేర్చుకుంటే టీమ్‌లోకి రావడానికి అవకాశాలు పెరుగుతాయి...
 

77
Image credit: PTI

శ్రేయాస్ అయ్యర్‌, దీపక్ హుడాలా బౌలింగ్‌లో వికెట్లు తీయగలిగితే ఆల్‌రౌండర్‌గా జట్టులోకి రావచ్చు. అయ్యర్‌కి బౌలింగ్ చేయడం ఇష్టమే కానీ దానిపై కాస్త శ్రద్ధ పెడితే మంచి స్పిన్నర్‌గా మారతాడు...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్...

click me!

Recommended Stories