టెస్టులు ఆడే విధానాన్నే మార్చిపడేస్తాం! మా దమ్ము, ధైర్యం అదే... ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్...

First Published Jul 5, 2022, 5:54 PM IST

ఏ నిమిషాన టెస్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడో కానీ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఇంగ్లాండ్ నయా కెప్టెన్ బెన్ స్టోక్స్. న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బెన్ స్టోక్స్ టీమ్, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియాని ఓడించి.. అప్పుడెప్పుడో ఆగస్టు 2021లో ప్రారంభమైన టెస్టు సిరీస్‌ని 2-2 తేడాతో సమం చేసింది...

నాలుగో ఇన్నింగ్స్‌లో 377 పరుగుల భారీ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించిన ఇంగ్లాండ్ టీమ్, టీమిండియాపై చరిత్రలో అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ చరిత్రలోనూ ఇదే అత్యధిక ఛేదన... 

377 పరుగుల లక్ష్యఛేదనలో దూకుడే మంత్రంగా మొదలెట్టిన ఇంగ్లాండ్, వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత పంథా మార్చలేదు. జో రూట్, జానీ బెయిర్‌స్టో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి, ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ని ముగించేశారు...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో జో రూట్ కెప్టెన్సీలో 11 టెస్టులాడి ఒక్క ఒక్క విజయం అందుకున్న ఇంగ్లాండ్, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాక వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచింది.. 

బెన్ స్టోక్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోకముందు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టు, వరుసగా నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకోవడంతో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టీమ్స్‌ని వెనక్కినెట్టి టాప్ 7లోకి ఎంట్రీ ఇచ్చింది.

‘ఓపెనర్లు ఇలా ఆడితే ఎంతటి లక్ష్యం అయినా చిన్నదైపోతుంది. ఎలా ఆడాలనేదానిపై డ్రెస్సింగ్ రూమ్‌లో క్లారిటీ ఉంటే, అది ఆటతీరులో క్లియర్‌గా కనిపిస్తుంది. ఐదు వారాల క్రితం 378 టార్గెట్ అంటే భయపడేవాళ్లం.. కానీ ఇప్పుడు కాదు...

Image credit: Getty

ఈ విజయంలో జో రూట్‌, జానీ బెయిర్‌స్టోలకు క్రెడిట్ దక్కాల్సిందే. అయితే జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు అద్భుతంగా ఎదుర్కొంటూ సెంచరీ భాగస్వామ్యం అందించిన ఓపెనర్లకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి.. వాళ్లు బాగా ఆడారు, అది కాదనలేం...

Joe Root

అయితే కొన్ని టీమ్ మాకంటే మెరుగ్గా ఉండొచ్చు, అయితే ఏ టీమ్ కూడా మా కంటే ధైర్యంగా ఉండదు.. ఈ కోట్ జాక్ లీచ్ చెప్పాడు. మేం దీన్నే మంత్రంగా మార్చుకున్నాం. దేన్నైనా ఫేస్ చేయడానికి కావాల్సిన దమ్ము, ధైర్యం ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి...

టెస్టులను ఆడే పద్ధతిని మార్చాలని మేం ప్రయత్నిస్తున్నాం. గత నాలుగైదు వారాలుగా మేం అనుకున్న ప్లాన్స్, పక్కాగా వర్కవుట్ అవుతున్నాయి.టెస్టు క్రికెట్‌కి కొత్త జీవం తెస్తున్నామనే అనుకుంటున్నా.. మా ఆటతో భవిష్యత్ తరాలకు టెస్టులపై ఆసక్తి పెంచగలిగితే చాలు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ నయా టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్...

click me!