విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లను దాటేసిన జో రూట్... ఏడాదిన్నరలో 11వ సెంచరీ...

Published : Jul 05, 2022, 04:29 PM IST

జో రూట్... రెండేళ్ల క్రితం దాకా చాలామందికి పెద్దగా తెలియని పేరు. అయితే ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో అతనో సంచలనంలా మారిపోయాడు. రెండేళ్ల క్రితం వరకూ టెస్టుల్లో 17 సెంచరీలు చేసి పర్వాలేదనిపించిన జో రూట్... ఇప్పుడు కెరీర్ పీక్ ఫామ్‌ని కొనసాగిస్తూ సెంచరీల మోత మోగిస్తున్నాడు...

PREV
16
విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లను దాటేసిన జో రూట్...  ఏడాదిన్నరలో 11వ సెంచరీ...
Image credit: Getty

టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో కలిసి 200+ భాగస్వామ్యం నెలకొల్పి... భారత జట్టుకి విజయాన్ని దూరం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు...

26

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 2019 నవంబర్‌లో టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేయగా, ఆ సమయానికి 17 సెంచరీలతో ఉన్న జో రూట్... రెండున్నరేళ్లలో 11 సెంచరీలతో 28 సెంచరీలు నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం 27వ సెంచరీ దగ్గరే ఆగిపోయాడు...

36
Joe Root

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 27 సెంచరీలతో విరాట్ కోహ్లీతో సమంగా రెండో స్థానంలో ఉన్నాడు. 2021 జనవరిలో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 27వ సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్, ఏడాదిన్నరగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు...

46
Joe Root

గత 24 టెస్టుల్లో 11 టెస్టు సెంచరీలు చేసిన జో రూట్... టీమిండియాపై 9వ టెస్టు సెంచరీ నమోదు చేసి రికీ  పాంటింగ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, విండీస్ లెజెండ్స్ వీవ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, స్టీవ్ స్మిత్.. టీమిండియాపై 8 టెస్టు సెంచరీలతో జో రూట్ తర్వాతి స్థానంలో నిలిచారు..

56
Joe Root

ప్రస్తుత తరంలో 10వేలకు పైగా టెస్టు పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన జో రూట్, 28వ టెస్టు సెంచరీ అందుకున్న  ప్లేయర్‌గానూ నిలిచాడు. ఫ్యాబ్ 4లో నాలుగో స్థానంలో నిలిచిన జో రూట్, ఏడాదిన్నరలో టాప్‌లోకి దూసుకురావడం విశేషం...

66
Joe Root

రెండేళ్ల క్రితం సెంచరీలు చేయడం ఇంత తేలికా... అన్నట్టు విరాట్ కోహ్లీ ఫామ్ కొనసాగితే... ఇప్పుడు జో రూట్ ఇదే జోరును చూపిస్తున్నాడు. టెస్టుల్లో 51 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డుకి 23 సెంచరీల దూరంలో ఉన్న జో రూట్, ఇదే స్పీడ్‌ని కొనసాగిస్తే మూడేళ్లలో మాస్టర్ రికార్డును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు..

click me!

Recommended Stories