టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస విజయాలు అందుకుంది భారత జట్టు. అయితే అవన్నీ స్వదేశంలో అందుకున్నవే. ఎప్పుడైతే విదేశాల్లో అడుగుపెట్టిందో వరుస పరాజయాలు అందుకుంటోంది ద్రావిడ్ టీమ్... ఎడ్జ్‌బాస్టన్ టెస్టు ఓటమితో మరోసారి రాహుల్ ద్రావిడ్ కోచింగ్ స్టైల్‌పై విమర్శలు వస్తున్నాయి...
రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అద్భుత విజయాలు అందుకుంటూ వచ్చింది. 2020 ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది భారత జట్టు...
29
Ravi Shastri and Virat Kohli
ఇంగ్లాండ్ టూర్‌లో తొలి టెస్టు వర్షం కారణంగా ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసింది కానీ ఆఖరి రోజు రెండు సెషన్ల పాటు ఆట సాగినా టీమిండియానే గెలిచేది. ఆ తర్వాత మూడు టెస్టుల్లో రెండింట్లో నెగ్గిన భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది...
39
Image credit: PTI
అలాంటి భారత జట్టు రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొంటూ ఉండడం టీమిండియా ఫ్యాన్స్‌ని కలవరబెడుతోంది. సౌతాఫ్రికా టూర్‌లో వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం పాలైన భారత జట్టు, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ చిత్తుగా ఓడింది...
49
Image credit: Getty
ఇంతకుముందు గత ఏడేళ్లలో నాలుగో ఇన్నింగ్స్‌లో 200+ టార్గెట్ ఇచ్చిన తర్వాత టెస్టు మ్యాచ్ ఓడిపోలేదు భారత జట్టు. అయితే రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2022లోనే మూడు సార్లు 200+ పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులు ఎత్తేసింది భారత జట్టు...
59
Image credit: PTI
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ ఆటతీరును ఎంతగా మెచ్చుకోగా భారత జట్టు వైఫల్యం కూడా చాలా ఉంది. ఎందుకంటే లార్డ్స్ టెస్టులో భారత జట్టు చూపించిన కసి, యాటిట్యూడ్... ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కనిపించలేదు...
69
Rahul Dravid
ది ఓవల్ టెస్టులో 368 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్‌కి ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, 210 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇలాంటి అవకాశమే వచ్చినా, భారత జట్టు ఉపయోగించుకోలేకపోయింది...
79
రవిశాస్త్రి దూకుడు మంత్రంతో విజయం కోసమే ప్రయత్నించేలా జట్టును ప్రోత్సహించేవాడు. అయితే రాహుల్ ద్రావిడ్ మాత్రం దీనికి విరుద్ధం. ద్రావిడ్ కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ కలవాడు. ఇదే ఇప్పుడు టీమిండియాకి విజయాలను దూరం చేస్తోందని అంటున్నారు భారత ఫ్యాన్స్...
89
రవిశాస్త్రి హయాంలో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్... ఇప్పుడు మునుపటి ఫామ్‌ని చూపించలేకపోవడం కూడా రాహుల్ ద్రావిడ్ కోచింగ్ స్టైల్‌పై ప్రశ్నలు రేకేత్తిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరోసారి భారత జట్టు స్వదేశంలో మాత్రమే విజయాలు అందుకునే ‘స్వదేశీ పులుల్లా’ మళ్లీ మారిపోతుందేమోనని భయపడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్...
99
రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా తప్పుకున్నాక విరాట్ కోహ్లీ కూడా టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఓ స్థిరమైన కెప్టెన్ దొరకకపోవడం కూడా భారత జట్టు వరుస వైఫల్యాలకు కారణంగా చెబుతున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..