వాషింగ్టన్ సుందర్ నుంచి మేం చాలా నేర్చుకోవాలి... ఓటమిపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

Published : Jan 28, 2023, 10:45 AM IST

ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచి, టీమిండియా తర్వాతి కెప్టెన్ రేసులోకి దూసుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు అసలు కెప్టెన్సీ రేసులో కూడా లేని పాండ్యా, ఇప్పుడు అనధికారంగా టీమిండియా టీ20 కెప్టెన్‌గా మారాడు...

PREV
17
వాషింగ్టన్ సుందర్ నుంచి మేం చాలా నేర్చుకోవాలి... ఓటమిపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
Image credit: PTI

కెప్టెన్‌గా వరుస విజయాలు అందుకున్న హార్ధిక్ పాండ్యాకి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఊహించని షాక్ తగిలింది. అంతకుముందు శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఓడినా.. ఆఖరి ఓవర్ వరకూ పోరాడిన భారత జట్టు, రాంఛీలో జరిగిన తొలి టీ20లో 21 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...

27
Washington Sundar

బౌలింగ్‌లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్, బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లతో 50 పరుగులు చేసి టీమిండియా తరుపున ఒంటరి పోరాటం చేశాడు...

37
Image credit: PTI

టాపార్డర్ ఫెయిల్ కావడంతో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాని, లోయర్ ఆర్డర్ వైఫల్యం కూడా వెంటాడింది. దీపక్ హుడా, శివమ్ మావి వెంటవెంటనే అవుట్ అవ్వడం భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపించింది...

47
Washington Sundar

‘పిచ్ ఇలా స్పందిస్తుందని మేం అస్సలు ఊహించలేదు. వాళ్లు మాకంటే బాగా ఆడారు అందుకే గెలిచారు. పాత బంతి కంటే కొత్త బంతి ఎక్కువ బౌన్స్ అవుతోంది. అయితే ఇలాంటి కష్టసాధ్యమైన పిచ్‌ మీద గెలిస్తేనే, టీమ్ బలంగా ఉన్నట్టు..

57
Washington Sundar

సూర్యకుమార్ యాదవ్, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గెలవగలమనే అనుకున్నాం. అయితే 25 పరుగుల తేడాతో ఓడడం మాత్రం మా తప్పే. బౌలింగ్‌లోనూ 25 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాం. కుర్రాళ్లు ఈ మ్యాచ్ నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవాలి...

67
Image credit: Getty

వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్‌ అదరగొట్టాడు, ఫీల్డింగ్ బాగా చేశాడు. బ్యాటింగ్‌లోనూ రాణించి న్యూజిలాండ్‌తో ఒంటరి పోరాటం చేశాడు...

77

అతని ఇన్నింగ్స్ నుంచి టీమ్ చాలా నేర్చుకోవాలి. క్లిష్ట సమయాల్లో ఎలా ఆడాలో అతని ఇన్నింగ్స్ ఓ ఉదాహరణ...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... 

click me!

Recommended Stories