రాక రాక అవకాశం వస్తే, వాడుకోని రాహుల్ త్రిపాఠి... మరో సంజూ శాంసన్‌లా అవుతాడా...

First Published | Jan 28, 2023, 9:40 AM IST

సంజూ శాంసన్‌కి దేశవాళీ టోర్నీల్లో మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లోనూ బాగా ఆడతాడు. అయితే టీమిండియాలో వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోయాడు సంజూ శాంసన్. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి వ్యవహారం కూడా ఇలాగే కనిపిస్తోంది...
 

Sanju Samson

ఎన్ని అవకాశాలిచ్చిన ఫెయిల్ అవ్వడంతో సంజూ బాగా ఆడుతున్నా పట్టించుకోవడం మానేసింది టీమిండియా... గాయాన్ని కారణంగా చూపించి సంజూ శాంసన్‌ని మరోసారి సైడ్ చేసింది భారత జట్టు...

Image credit: PTI

విజయ్ హాజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 524 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, టీమిండియాలో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పుడెప్పుడో ఐర్లాండ్‌తో సిరీస్‌కి రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేసినా, ఆ తర్వాత జరిగిన జింబాబ్వే టూర్‌తో పాటు ఇంగ్లాండ్ టూర్, బంగ్లా టూర్‌లోనూ రిజర్వు బెంచ్‌లోనే కూర్చున్నాడు...


Rahul Tripathi

తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి, 6 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. అది కూడా అతని సొంత గడ్డ రాంఛీలో...  ఈ పర్ఫామెన్స్ అతని కెరీర్‌పైనే ప్రభావం చూపే అవకాశం ఉంది...

Rahul Tripathi

ఎందుకంటే టీమిండియా, టీ20 వరల్డ్ కప్‌ కోసం ఓ 20 మంది ప్లేయర్లను అనుకుని, వారికి మాత్రమే అవకాశాలు ఇస్తూ వచ్చింది. ఆ 20 మంది లిస్టులో లేని ప్లేయర్లు ఎంత బాగా ఆడినా వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి కూడా ఆ పట్టించుకోని ప్లేయర్లలో చేరిపోయే ప్రమాదంలో పడ్డాడు.

Image credit: PTI

రాహుల్ త్రిపాఠి వయసు ఇప్పటికే 31 ఏళ్లు. చాలామంది క్రికెటర్లు రిటైర్మెంట్ గురించి ఆలోచన చేసే వయసులో త్రిపాఠి, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. ఇలాంటి టైమ్‌లో వచ్చిన ప్రతీ ఛాన్స్, అతనికి సువర్ణావకాశమే. వాటిని అంత ఎంత బాగా ఒడిసి పట్టుకుంటే, టీమ్‌లో అంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది...

Image credit: Getty

ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఉండడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉన్నారు. అందుకే ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి వంటి ప్లేయర్లకు టీ20ల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

Rahul Tripathi

వచ్చే ఏడాదిలో విరాట్ కోహ్లీ, టీ20ల్లోకి వస్తే వన్‌డౌన్‌ ప్లేస్ నుంచి రాహుల్ త్రిపాఠి సైడ్ అవ్వాల్సిందే. ఆ లోపు తన ప్లేస్‌ని దక్కించుకునేందుకు అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాలి... 

Latest Videos

click me!