అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ వన్‌సైడెడ్‌గా సాగి, అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. టీమిండియా బౌలర్ల ముందు పాకిస్తాన్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు...
155/2 స్కోరుతో ఉన్న పాకిస్తాన్, 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 86, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో 7 వికెట్ల తేడాతో టీమిండియాకి ఘన విజయం దక్కింది..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో ఉన్న ఇండియా- పాకిస్తాన్ మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని వేలకు వేలు పెట్టి, స్టేడియానికి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్... వన్‌సైడ్ మ్యాచ్ చూసి కాస్త నిరాశ చెందారు... ఈ పరాజయంతో పాక్ టీమ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది..
‘మేం ఆడేటప్పుడు పాకిస్తాన్ టీమ్ ఇలా ఉండేది కాదు. అది పూర్తిగా డిఫరెంట్ టీమ్. వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ ఉండేది. వాళ్ల బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉండేది.. ఇలాంటి పాక్ టీమ్‌తో మేం ఆడేవాళ్లం కాదు...
ఇప్పుడున్న పాకిస్తాన్ టీమ్ పేపర్ మీద మాత్రమే పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్‌ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి బ్యాటింగ్‌తో వరల్డ్ కప్‌లో నెట్టుకురావడం చాలా కష్టం..
బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఎవరి బ్యాటింగ్‌లోనూ నాకు కసి కనిపించలేదు. టెక్నిక్ తెలియనట్టు, భయపడుతూ ఆడినట్టే అనిపించింది.
india vs pakistan
మేం చూసిన పాకిస్తాన్ టీమ్ అస్సలు ఇలా ఉండేది కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..