ఇక చాలు! వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ అవుట్...

Published : Oct 17, 2023, 05:30 PM IST

టీమిండియా ప్లేయర్‌గా ఎంతో అభిమానం చొరగొన్న రాహుల్ ద్రావిడ్, ఎంతో మందికి ఫెవరెట్ ప్లేయర్ కూడా. అయితే హెడ్ కోచ్‌గా మారిన తర్వాత తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది ద్రావిడ్...

PREV
16
ఇక చాలు! వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ అవుట్...

రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆ పొజిషన్‌లో బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. అప్పటికే అండర్19 వరల్డ్ కప్ గెలిచిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్ కోచ్‌గా వచ్చేందుకు ఇష్టపడకపోయినా అప్పటి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఒప్పించి, ఆ పొజిషన్‌లో కూర్చోబెట్టాడు..
 

26
Rahul Dravid-Hardik Pandya

రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచింగ్‌లో టీమిండియాకి 8 మంది కెప్టెన్లు మారారు. 2022 ఏడాదిలో అయితే ఏకంగా ఏడుగురు కెప్టెన్ల సారథ్యంలో మ్యాచులు ఆడింది భారత్. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో ఓడిన టీమిండయా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ టూర్‌లలో వన్డే సిరీస్‌లో ఓడింది..

36

ఈ పరాజయాలకు తోడు బీసీసీఐ కక్ష కట్టి, విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించడంతో రాహుల్ ద్రావిడ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఆసియా కప్ 2023 టోర్నీ విజయంతో టీమ్‌ గాడిలోకి వచ్చింది..

46
Virat Kohli Rahul Dravid

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగియనుంది. ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రావిడ్ ఇష్టపడడం లేదని సమాచారం. వరల్డ్ కప్ టైటిల్ గెలిచినా, గెలవకపోయినా ద్రావిడ్‌కి ఇదే ఆఖరి టోర్నీ అని కూడా ప్రచారం జరుగుతోంది..

56
Rahul Dravid and Rohit Sharma

రిటైర్మెంట్ తర్వాత కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న రాహుల్ ద్రావిడ్, ఇంటికి దగ్గరగా ఉందనే కారణంగానే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రెసిడెంట్‌గా చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక రెండేళ్లుగా ద్రావిడ్, తన కుటుంబంతో సరిగ్గా గడపలేకపోతున్నాడు..

66
Rahul Dravid-Rohit Sharma

రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్, కర్ణాటక వినూ మన్కడ్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతని కెరీర్‌ని గాడిలో పెట్టే పనిని స్వయంగా తీసుకోవాలని భావిస్తున్న ద్రావిడ్, టీమిండియా హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయ్యాడట... 

click me!

Recommended Stories