ఇప్పుడు వీళ్లకి ఫిట్‌నెస్ టెస్టు కూడా లేదు! అంతా వాళ్ల ఇష్టం అయిపోయింది.. పాక్ టీమ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్..

First Published | Oct 17, 2023, 3:03 PM IST

ఎన్ని విజయాలు అందుకున్నా, ఒకే ఒక్క పరాజయం అన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇదే. చిన్న చిన్న జట్లపై గొప్ప గొప్ప విజయాలు అందుకుంటూ నెం.1 వన్డే టీమ్‌గా అవతరించిన పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ వరుసగా రెండు విజయాలు అందుకుంది..
 

నెదర్లాండ్స్‌పై ఘన విజయం అందుకున్న పాకిస్తాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి... వరల్డ్ కప్‌లో అత్యధిక టార్గెట్‌ని ఛేదించిన జట్టుగా రికార్డు కూడా క్రియేట్ చేసింది..
 

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది పాకిస్తాన్. 155/2 స్కోరుతో 280+ స్కోరు చేసేలా కనిపించిన పాకిస్తాన్, 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ స్వల్ప లక్ష్యఛేదనలో బౌలర్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు..
 


రోహిత్ శర్మ 86, శ్రేయాస్ అయ్యర్ 53 పరుగులు చేయడంతో 31.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసింది భారత జట్టు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత జట్టుకి ఇది వరుసగా 8వ విజయం..
 

Babar Azam

‘నాకు ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించే ఆందోళనగా ఉంది. ఎందుకంటే కొన్ని నెలలుగా వీళ్లకు ఫిట్‌నెస్ టెస్టు కూడా జరగడం లేదు. మిస్బా ఉల్ హక్ కోచ్‌గా, సెలక్టర్‌గా ఉన్నప్పుడు కచ్ఛితంగా యో-యో టెస్టు, ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయిన వాళ్లకే టీమ్‌లో చోటు ఇచ్చేవాడు..

ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కొనసాగాలనుకునే ప్లేయర్లు కచ్ఛితంగా నెలకు ఓసారి అయినా ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొనాలి. అలా చేయకపోతే ఇలాంటి పరాజయాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది..
 

పీసీబీ గత మూడేళ్లలో ముగ్గురు ఛైర్మెన్లను మార్చింది. ఇప్పుడున్న వాళ్లు కూడా వచ్చే సిరీస్ వరకూ ఉంటారో లేదో తెలియని పరిస్థితి. ప్లేయర్లు మాత్రం ఆడినా ఆడకపోయినా టీమ్‌లో చోటు ఉంటుందని ధీమాగా ఉన్నారు. అందుకే ఇంత నిర్లక్ష్యంగా ఆడుతున్నారు..’ అంటూ కామెంట్ చేశాడు పాకిసత్ాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్...

పాకిస్తాన్ తన తర్వాతి మ్యాచ్‌ని అక్టోబర్ 20న బెంగళూరులో ఆస్ట్రేలియాతో ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్, శ్రీలంకపై ఘన విజయంతో బోణీ కొట్టింది. కాబట్టి పాకిస్తాన్, ఆస్ట్రేలియా రెండు జట్లకీ ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది.. 

Latest Videos

click me!