David Warner: ఆ జట్టును స్వదేశంలో ఓడించాలి.. అదే నా కల.. వార్నర్ భాయ్ డ్రీమ్ అదేనట..

Published : Dec 29, 2021, 10:59 AM ISTUpdated : Dec 29, 2021, 11:01 AM IST

David Warner: ఆస్ట్రేలియా  ఓపెనింగ్ బ్యాటర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ యాషెస్ గెలిచాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

PREV
112
David Warner: ఆ జట్టును స్వదేశంలో ఓడించాలి.. అదే నా కల.. వార్నర్ భాయ్ డ్రీమ్ అదేనట..

వరుసగా టీ20 ప్రపంచకప్ తో పాటు యాషెస్ సిరీస్ గెలిచి తిరిగి పూర్వపు ఫామ్ ను అందుకుంటున్న ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడు డేవిడ్ వార్నర్. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టులలో అతడు సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

212

అయితే  యాషెస్ గెలిచిన అనంతరం అతడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము సాధించినదానికి చాలా సంతోషంగా ఉందని, కానీ టీమిండియాను వాళ్ల స్వదేశంలో ఓడించగలిగితే తాము  చాలా సాధించినట్టేనని చెప్పుకొచ్చాడు. 

312

మూడో టెస్టు తర్వాత ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో వార్నర్ మాట్లాడుతూ.. ‘మేము ఇంకా భారత్ లో భారత్ ను ఓడించలేదు. (2004 తర్వాత ఆసీస్ జట్టు భారత్ ను భారత్ లో టెస్టులలో ఓడించలేదు) అది జరిగితే చాలా బాగుంటుంది.

412

అంతేగాక  2019లో మేము  ఇంగ్లాండ్ తో సిరీస్(యాషెస్) ను డ్రా చేసుకున్నాము. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఆ సిరీస్ ను మేము గెలవాలని ఉంది...’ అని వార్నర్ అన్నాడు. 

512

2019 యాషెస్ సిరీస్ లో  వార్నర్ పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఆ సిరీస్ లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అతడిని పలుమార్లు ఔట్ చేశాడు. 

612

ఇక ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గురించి వార్నర్ స్పందిస్తూ.. ‘వయసు మీరిన క్రికెటర్లకు అండర్సన్ రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు. ఈ వయసులో కూడా జేమ్స్ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు.

712

నా దృష్టిలో వయసు అనేది ఆడటానికి సమస్య కాదు. నా  సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇవ్వడం.. పరుగులు సాధించడం వంటివి మాత్రమే కీలకం. గత రెండు టెస్టులలో నేను బాగానే బ్యాటింగ్ చేశాను.

812

నా కెరీర్ ను మరో విధంగా ఆడినట్టు అనిపిస్తున్నది. బౌలర్ల  లైన్ అండ్ లెంగ్త్ ను గౌరవిస్తూ నా ఆటను నేను ఆడుతున్నాను... అందుకే పరుగులు సాధిస్తున్నాను..’అన్నాడు వార్నర్ భాయ్. 

912

ప్రస్తుతానికి తాను మంచి ఫామ్ లో ఉన్నానని, వచ్చే ఏడాది వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తానని ఈ మాజీ సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి చెప్పుకొచ్చాడు. 
 

1012

ఇదిలాఉండగా.. ఆసీస్ జట్టు యాషెస్  గెలవడంలో కీలక పాత్ర  పోషించిన వార్నర్ ను తన మాజీ  ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ ప్రశంసల్తో ముంచెత్తింది.  ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ.. వార్నర్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ కూడా చేసింది.  

1112

ఐపీఎల్ 2022 సీజన్ కోసం మంచి జట్టును ఎంచుకోవాలని జట్టు కోచ్ టామ్ మూడీకిఓ అభిమాని సలహా ఇచ్చాడు. దీనికి తప్పక ప్రయత్నిస్తామని మూడీ  రిప్లై ఇచ్చాడు. కాగా, దీనిని ట్యాగ్ చేస్తూ  వార్నర్ ‘అది పెద్ద అనుమానమే..’ అని స్పందించాడు. 

1212

దీనికి  సన్ రైజర్స్ సమాధానమిస్తూ.. ‘యాషెస్ గెలిచినందుకు కంగ్రాట్స్ డేవిడ్. తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టు కనిపిస్తున్నావ్.. విన్నింగ్ పార్టీని ఎంజాయ్  చెయ్. ఐపీఎల్ మెగా వేలంలో  నీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం..’ అని ట్వీట్ చేసింది. 

click me!

Recommended Stories