ఒకే ఇన్నింగ్స్‌లో మూడు రికార్డులు... మాహీని దాటేసిన రిషబ్ పంత్... జస్ప్రిత్ బుమ్రా, షమీ కెరీర్‌లో...

First Published Dec 28, 2021, 9:21 PM IST

బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్లు ముగ్గురు కెరీర్‌లో మైలురాళ్లను చేరుకున్నారు. టీమిండియా ఆధిపత్యం సాగించిన సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా కెరీర్‌లో మైలురాళ్లను అందుకున్నారు.

వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఎమ్మెస్ ధోనీ రికార్డును అధిగమించి... టీమిండియా తరుపున అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు...

26 టెస్టులు ఆడిన రిషబ్ పంత్, ఈ మ్యాచ్‌కి ముందు వరకూ 89 క్యాచులు, 8 స్టంపౌట్లు చేశాడు. నేటి మ్యాచ్‌లో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్, భవుమా, ముల్దర్, రబాడా క్యాచులను అందుకున్న రిషబ్ పంత్... టెస్టుల్లో 100 వికెట్లు తీయడంలో భాగమైన వికెట్ కీపర్‌గా నిలుచాడు...

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 100 వికెట్లలో భాగం పంచుకోవడానికి 36 టెస్టులు తీసుకున్నాడు. రిషబ్ పంత్ కేవలం 26 టెస్టుల్లోనూ మాహీ రికార్డును దాటేశాడు.

ఓవరాల్‌గా మాహీ ఈ ఫీట్ సాధించడానికి 67 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే, పంత్ 50వ ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు...

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ, టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరుపున ఈ ఫీట్ అందుకున్న ఐదో భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు షమీ...

కపిల్ దేవ్ 434 వికెట్లతో టాప్‌లో ఉండగా, జహీర్ ఖాన్ 311, ఇషాంత్ శర్మ 311, జవగళ్ శ్రీనాథ్ 236 వికెట్లతో మహ్మద్ షమీ కంటే ముందు 200 టెస్టు వికెట్లను అందుకున్నారు.

డీన్ ఎల్గర్ వికెట్ తీసిన జస్ప్రిత్ బుమ్రా, టెస్టు కెరీర్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 47వ టెస్టు ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించిన బుమ్రా, సౌతాఫ్రికాలోనే తన మొట్టమొదటి టెస్టు వికెట్ సాధించడం మరో విశేషం...

click me!