ఐసీసీ టైటిల్స్ గెలవాలంటే అదొక్కటే మార్గం... సునీల్ గవాస్కర్ కామెంట్...

First Published Dec 28, 2021, 7:57 PM IST

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, గ్రూప్ స్టేజీకి పరిమితమై తీవ్రంగా నిరాశపరిచింది. 2014 నుంచి వరుసగా ఏడో ఐసీసీ టోర్నీలో టైటిల్ లేకుండానే వెనుదిరిగింది భారత జట్టు...

2013లో ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత మాహీ కెప్టెన్సీలోనే 2014, 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో టైటిల్ గెలవకుండానే ఇంటిదారి పట్టింది...

2011 వన్డే వరల్డ్‌ కప్ గెలిచిన భారత జట్టు, 2015, 2019 సీజన్లలో ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేక సెమీస్ నుంచే నిష్కమించింది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురైంది...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు పేలవ ప్రదర్శన కారణంగా విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీని కూడా కోల్పోవాల్సి వచ్చింది. రోహిత్ కెప్టెన్సీలో 2022 టీ20 వరల్డ్ కప్ ఆడనుంది టీమిండియా...

‘1983లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు జట్టులో ఉన్నది 14 మంది ప్లేయర్లు, ఓ మేనేజర్ మాత్రమే, అయినా మేం విశ్వకప్ గెలిచి ప్రపంచాన్ని మా వైపు తిప్పుకోగలిగాం...

అప్పుడు ఇప్పటిలా ఫీల్డింగ్ నిబంధనలు లేవు, ఒక ఓవర్‌లో ఇన్నే బౌన్సర్లు వేయాలనే రూల్స్ కూడా లేవు. అదీ కాకుండా ఇంగ్లాండ్‌లో రెడ్ బాల్‌తో ఆడి ప్రపంచకప్ గెలవగలిగాం...

ఎందుకంటే అప్పటి టీమ్‌లో అందరూ ఆల్‌రౌండర్లే ఉన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టైటిల్ గెలవాలంటే ఇది అసలైన విజయ రహస్యం... 2007, 2011 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ ఇదే జరిగింది... 

యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, సెహ్వాగ్ వంటి ప్లేయర్లు బౌలింగ్ చేయగలరు, బ్యాటింగ్ చేయగలరు... ఇప్పుడు టీమిండియా ఇదే ఫార్ములాను వాడితే బెటర్...

హార్ధిక్ పాండ్యా లేదా వెంకటేశ్ అయ్యర్‌లలో ఒకరినే ఆడించాలనుకునే బదులు ఇద్దరినీ ఆడించాలి. వారితో పాటు రవీంద్ర జడేజా కూడా జట్టులో ఉంటే జట్టుకి బౌలింగ్ ఆప్షన్లు పెరుగుతాయి...

ఇలా ఇద్దరి కంటే ఎక్కువ ఆల్‌రౌండర్లతో బరిలో దిగితే 2022 ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌లో కానీ, 2023 భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో కానీ గెలవడానికి అవకాశాలు పెరుగుతాయి...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్... 

click me!