మా బౌలింగ్‌ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు... టీమిండియాతో మ్యాచ్‌కి ముందు సఫారీ బౌలర్ ఆన్రీచ్ నోకియా...

First Published | Oct 30, 2022, 1:45 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో సౌతాఫ్రికా కూడా ఒకటి. గ్రూప్ 2లో పాకిస్తాన్ తొలి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడడంతో సౌతాఫ్రికా, టీమిండియా, బంగ్లాదేశ్ మాత్రమే సెమీస్ రేసులో నిలిచాయి. ఇందులో ఇండియాతో పాటు సౌతాఫ్రికా ఫెవరెట్స్‌గా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు...

South Africa

తొలి రెండు మ్యాచుల్లో అదరగొట్టిన భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా... టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్న సౌతాఫ్రికాపై ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అండ్ కో బ్యాటింగ్ ఫామ్‌పై ఉన్న అనుమానాలు కూడా ఈ మ్యాచ్ ద్వారా తీరబోతున్నాయి...

ఎందుకంటే సౌతాఫ్రికాలో ఆన్రీచ్ నోకియా, మార్కో జాన్సెన్, కగిసో రబాడా, లుంగి ఇంగిడి, వేన్ పార్నెల్ రూపంలో టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌లపై వీరి బౌలింగ్‌ని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు...


ఆన్రీచ్ నోకియా 140+ కి.మీ.ల పేస్‌తో బౌలింగ్ చేస్తే, కగిసో రబడా స్వింగ్ అండ్ సీమ్ కలిపి బంతులను 145+కి.మీ.ల వేగంతో విసురుతాడు. ఇక ఆరున్నర అడుగులకు పైగా పొడవు ఉండే మార్కో జాన్సెన్ వేసే బౌన్సర్లు ఎదుర్కోవడం ఏ బ్యాటర్‌కి అయినా కష్టమే...

Kagiso Rabada

‘అవును... మా టీమ్‌లో బెస్ట్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. మా వరకూ టీ20 వరల్డ్ కప్‌లో బెస్ట్ పేస్ అటాక్ ఉన్న టీమ్ మాదే. అంతేకాకుండా మా టీమ్‌లో ఒక్కో ఫాస్ట్ బౌలర్‌కి ఒక్కో వెరైటీ యాక్షన్, స్పెషాలిటీ ఉంది...

Lungi Ngidi

ఏ టీమ్‌లో ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు కూడా ఉన్నారు. ఎలా చూసినా సౌతాఫ్రికా బౌలింగ్ అటాక్‌ని తట్టుకుని నిలబడడం కష్టమే. టీ20 క్రికెట్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం...’ అంటూ చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆన్రీచ్ నోకియా... 

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ని నెగ్గిన భారత జట్టు, సౌతాఫ్రికా పర్యటనలో సఫారీ బౌలర్లను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడింది. కెఎల్ రాహుల్‌ కెప్టెన్సీలో మూడు వన్డేల్లో ఓడి వైట్ వాష్ అయ్యింది టీమిండియా...

Latest Videos

click me!