KL Rahul
తొలి మ్యాచ్‌లో 4 పరుగులకు అవుటైన కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 12 బంతులు ఆడి 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. రెండు మ్యాచుల్లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన కెఎల్ రాహుల్ ఫామ్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది...
KL Rahul
టీమ్ కాంబినేషన్ కారణంగా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, మొదటి రెండు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. పాక్‌తో మ్యాచ్‌లో బ్యాటుతో ఫెయిల్ అయిన దినేశ్ కార్తీక్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రావాల్సిన పని రాలేదు...
దినేశ్ కార్తీక్‌కి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్, కెఎల్ రాహుల్ ప్లేస్‌లో రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఆడించేందుకు ప్రయత్నాలు చేస్తోందట. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా కెఎల్ రాహుల్ ఫెయిల్ అయితే రిషబ్ పంత్‌కి గేట్లు తెరుచుకుంటాయని టాక్ వినబడుతోంది...
రెండు మ్యాచుల్లో కలిపి సక్కగా 20 బంతులు కూడా ఆడలేకపోయిన కెఎల్ రాహుల్‌ని కొనసాగించడం కంటే రిషబ్ పంత్‌ని తీసుకొస్తే... లెఫ్ట్ హ్యాండ్- రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుందని భావిస్తోందట మేనేజ్‌మెంట్...
Image credit: Getty
ఈ ఏడాది సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు 50+ స్కోర్లు చేసిన కెఎల్ రాహుల్, గత ఏడాదికాలంలో 9 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. మరో మూడు సార్లు డకౌట్ అయ్యాడు... ఐపీఎల్‌లో మాత్రమే రాణిస్తూ, టీమిండియా విషయానికి వచ్చేసరికి విఫలమవుతున్నాడు...
KL Rahul
‘కేవలం రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రం కెఎల్ రాహుల్ సత్తాని తక్కువ చేయలేం. అతను ఫామ్‌లోకి వస్తే ఎలా ఆడగలడో అందరికీ తెలుసు. అయితే టీ20 వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో ఎక్కువ ఛాన్సులు తీసుకోలేం...
ప్రాక్టీస్ మ్యాచుల్లో కెఎల్ రాహుల్ బాగా ఆడాడు. అందుకే అతనికి ఇంకా ఛాన్సులు వస్తున్నాయి. అయితే రిలాక్స్ అయిపోతే, సీటు చిరుగుతుందని అతనికి ముందే చెప్పాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ప్లేస్‌కి గ్యారెంటీ లేదు...
Image credit: PTI
కేవలం 11 మంది మాత్రమే తుది జట్టులో ఆడగలరు. అందుకే రిషబ్ పంత్ లాంటి అద్బుతమైన మ్యాచ్ విన్నర్‌ని కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాల్సి వస్తోంది. కెఎల్ రాహుల్ ఇలాగే ఫెయిల్ అయితే టీమ్ మేనేజ్‌మెంట్ కచ్ఛితంగా రిషబ్ పంత్ వైపు చూస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్..