టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సెలక్ట్ చేసే జట్టులో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ప్లేస్ ఉంటుందా? లేదా? ఇప్పుడు భారత క్రికెట్ ఫ్యాన్స్‌ని కలవరబెడుతున్న కొత్త అనుమానం ఇది. దీనికి కారణం మహ్మద్ షమీ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ, 17వ ఓవర్‌లో 17 పరుగులు సమర్పించాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరొందిన షమీని, మహ్మద్ రిజ్వాన్ ఎంతో ఈజీగా బాదేయడం విమర్శలకు తావిచ్చింది...
29
Mohammed Shami
ఈ మ్యాచ్ తర్వాత మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దూషణలకు దిగారు టీమిండియా అభిమానులు. షమీ మతాన్ని ఎత్తి చూపిస్తూ, కావాలనే పాకిస్తాన్‌ని గెలిపించాడంటూ అర్థం లేని కామెంట్లు చేస్తూ సైబర్ అటాక్ చేశారు...
39
Mohammed Shami
ఈ సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా భారత జట్టు సభ్యులు, మాజీ క్రికెటర్లు అందరూ మహ్మద్ షమీకి అండగా నిలిచారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత మహ్మద్ షమీ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం...
49
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలతో టీ20 సిరీస్‌లు ఆడింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. మహ్మద్ షమీకి ఈ సిరీస్‌లలో ఒక్కదాంట్లో కూడా చోటు దక్కలేదు...
59
‘చూస్తుంటే మహ్మద్ షమీ, టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో లేనట్టే కనిపిస్తోంది. అతని సత్తా ఏంటో అందరికీ తెలుసు. కానీ ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో షమీని ఆడించేందుకు టీమిండియా ఇంట్రెస్ట్ చూపించడం లేదనుకుంటా...
69
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత అతను ఇప్పటిదాకా ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. వరల్డ్ కప్ ఆడించే ప్లేయర్‌ను ఇన్ని మ్యాచుల్లో పక్కనబెడతారా? నాకు తెలిసి 2023 వరల్డ్ కప్‌లో మాత్రం షమీ తప్పకుండా ఉండొచ్చు...
79
ఎందుకంటే మహ్మద్ షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయగలడు. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌లో మహ్మద్ షమీ తప్పకుండా ఆడతాడని అనుకుంటున్నా...
89
ఇంగ్లాండ్‌ని ఇంగ్లాండ్‌లో ఓడించాలంటే టాప్ క్లాస్ ప్లేయర్లతో బరిలో దిగాలి. అందుకే మహ్మద్ షమీని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఫిట్‌గా ఉంచేందుకు టీ20 మ్యాచులకు దూరంగా పెడుతున్నారేమో...’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...
99
భారత జట్టు తరుపున 17 టీ20 మ్యాచులు ఆడిన మహ్మద్ షమీ, 18 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 148 వికెట్లు పడగొట్టాడు. 57 టెస్టు మ్యాచులు ఆడి 212 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో నమీబియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు...