తండ్రి బాటలో కెరీర్ ప్రారంభించినా సినిమాల్లో అయినట్టుగా క్రికెట్‌లో సక్సెస్ సాధించడం చాలా కష్టం. సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్, రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీ... టీమిండియాలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. ‘భారత రత్న’ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా అవకాశాలు దక్కించుకోవడంలో వెనుకబడుతున్నాడు...
తండ్రి బాటలో బ్యాటర్‌గా కెరీర్ మొదలెట్టిన అర్జున్ టెండూల్కర్ ఆ పొజిషన్‌కి తీవ్రమైన పోటీ ఉండడంతో భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి ఆల్‌రౌండర్‌గా అవతారం ఎత్తాడు... టీనేజ్ వయసులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మారాడు అర్జున్...
28
అయితే అర్జున్ టెండూల్కర్‌కి అదృష్టం ఉన్నా.. అవకాశాలు కానీ, సక్సెస్ కానీ అందడం లేదు. సచిన్ కొడుకు కావడంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, ఈసారి మరో రూ.10 లక్షలు చేర్చి రూ.30 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది...
38
అయితే రెండు సీజన్లలోనూ అర్జున్ టెండూల్కర్‌కి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ఇలాంటి దారుణమైన సీజన్‌లోనూ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ని తుది జట్టులో ఆడించే సాహసం చేయలేదు ముంబై ఇండియన్స్...
48
అనధికారికంగా నెట్ బౌలర్‌గా నాలుగైదు సీజన్లుగా, అధికారికంగా గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్‌తో ఉంటూ వస్తున్న అర్జున్ టెండూల్కర్‌కి మాత్రం ఈ సీజన్‌లో కూడా నిరాశే ఎదురైంది... మరోవైపు రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లోనూ అర్జున్ టెండూల్కర్‌కి అవకాశం దక్కలేదు...
58
క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ ఆడిన ముంబై జట్టులో అర్జున్ టెండూల్కర్‌కి చోటు దక్కలేదు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు అర్జున్ టెండూల్కర్.
68
‘వరల్డ్‌లో ది బెస్ట్ స్ట్రాబ్లెడ్ ఎగ్స్‌ని ఈ రోజు తిన్నాను. వాటిని అర్జున్ చేశాడు. ఆ క్రీమీనెస్, ఆ షేప్, ఆ రుచి... అదిరిపోయిందంతే... బ్రేక్ ఫాస్ట్, ప్రేమతో నిండిపోయింది. దీనికంటే ఎక్కువేం అడగలేను...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్..
78
సచిన్ టెండూల్కర్ ట్వీట్‌తో అర్జున్ టెండూల్కర్‌పై మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. క్రికెటర్‌గా సక్సెస్ రాకపోవడంతో అర్జున్ టెండూల్కర్ చెఫ్‌గా కెరీర్ ప్రారంభించాలని, సచిన్‌నే మెప్పించిన అతను... ఆ రంగంలో అద్భుతంగా రాణిస్తాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
88
భోజన ప్రియుడైన సచిన్ టెండూల్కర్‌కి ముంబైలో టెండూల్కర్స్ పేరుతో ఓ రెస్టారెంట్ ఉంది. అలాగే బెంగళూరులోనూ ‘సచిన్స్’ పేరుతో మరో రెస్టారెంట్ కూడా ఉంది. కాబట్టి అర్జున్ అటు వైఫు ఫోకస్ పెడితే, ఇలా అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదంటున్నారు అభిమానులు..