సిరీస్‌లు ఓడినా, వారిని వదులుకోం... ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలపై విరాట్ కోహ్లీ...

First Published Jan 14, 2022, 7:10 PM IST

ఎమ్మెస్ ధోనీకి ఏ ప్లేయర్ అయినా నచ్చితే, మిగిలిన ప్లేయర్లను పక్కనబెట్టి అతనికే వరుస అవకాశాలు ఇచ్చేవాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా టీమిండియా ఇద్దరు సీనియర్ల విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నాడు...

రాహుల్ ద్రావిడ్ తర్వాత ఆ స్థాయి డిఫెన్సివ్ టెక్నిక్‌తో ‘నయా వాల్’గా పేరు తెచ్చుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. టెస్టుల్లో అద్భుతంగా రాణించి, టీమిండియాకి ఎన్నో విజయాలు అందించాడు...

టెస్టు వైస్ కెప్టెన్‌గా, కెప్టెన్‌గా అదరగొట్టాడు అజింకా రహానే. విదేశాల్లో స్టార్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయిన చోట రహానే అద్భుతంగా రాణించేవాడు...

అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కెరీర్‌లో అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా టూర్ 2020-21 తర్వాత ఈ ఇద్దరూ వరుసగా ఫెయిల్ అవుతూ జట్టుకి భారంగా మారారు...

సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో అజింకా రహానే ఓ హాఫ్ సెంచరీతో 136 పరుగులు చేస్తే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ఓ హాఫ్ సెంచరీతో 135 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

ఛతేశ్వర్ పూజారా కూడా ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒకే హాఫ్ సెంచరీతో 124 పరుగులు మాత్రమే చేశాడు. పూజారా, రహానే ఈ టెస్టు సిరీస్‌ల్లో ఒక్కోసారి గోల్డెన్ డకౌట్ కావడం విశేషం...

ఈ ముగ్గురి కంటే టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో ఎక్కువ పరుగులు వచ్చాయి. మూడు టెస్టుల్లో కలిపి సౌతాఫ్రికా బౌలర్లు 136 ఎక్స్‌ట్రాలు సమర్పించారు...

వరసగా ఫెయిల్ అవుతూ, టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోవడానికి కారణమైనప్పటికీ అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా సహకారం ఇస్తామని అంటున్నాడు విరాట్ కోహ్లీ...

‘సెలక్టర్ల గురించి నాకు తెలీదు. వాళ్లిద్దరినీ సెలక్ట్ చేస్తే మాత్రం అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలకు మా సపోర్ట్ ఉంటుంది. సీనియర్లుగా వారి అనుభవం జట్టుకి చాలా అవసరం...’ అంటూ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

జట్టులోని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు సౌతాఫ్రికా సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. 100 టెస్టులకు పైగా అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ,  కాన్పూర్ టెస్టులో వికెట్ తీయలేకపోయాడని అతన్ని పక్కనబెట్టేశాడు విరాట్...

అలాంటిది అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాల విషయంలో మాత్రం ఇలా పక్షపాతం చూపించడం ఎందుకని నిలదీస్తున్నారు టీమిండియా అభిమానులు... 

click me!