ఆ మ్యాచ్‌లో విరాట్ ఉండి ఉంటేనా... జోహన్‌బర్గ్‌లో పట్టు కోల్పోయిన టీమిండియా...

First Published Jan 14, 2022, 6:46 PM IST

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలనే విరాట్ కోహ్లీ, టీమిండియా కల నెలవేరలేదు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి, టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో చేజార్చుకుంది భారత జట్టు...

19 ఏళ్లుగా టెస్టు మ్యాచ్ గెలవని సెంచూరియన్‌లో తొలి టెస్టులో విజయం అందుకుని, ఫుల్ జోష్‌లో సిరీస్‌ను ఆరంభించింది విరాట్ సేన...

మొదటి టెస్టులో టీమిండియా ఆటతీరు చూసిన అందరూ, సిరీస్‌ను భారత జట్టు ఈజీగా కైవసం చేసుకుంటుందని భావించారు...

వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు చేతుల్లో క్లీన్ స్వీప్ కాకుండా కాపాడుకోవాలంటే సౌతాఫ్రికా కష్టపడాల్సిందేనని అనుకున్నారు...

అయితే రెండో టెస్టు నుంచి సీన్ మారిపోయింది. విరాట్ కోహ్లీ వెన్ను గాయంతో జోహన్‌బర్గ్ టెస్టులో బరిలో దిగకపోవడం ఆతిథ్య జట్టుకి బాగా కలిసి వచ్చింది...

విరాట్ లేని టీమిండియాను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా, అదే ఫార్ములాను మూడో టెస్టులోనూ ఫాలో అయ్యింది... ఫామ్‌లో లేని విరాట్, తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెడితే, సిరీస్ ఫలితం మాత్రం సఫారీలకు దక్కింది...

రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ గాయపడడం కూడా టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ఫామ్‌లో ఉన్న సిరాజ్ లేని లోటు మూడో టెస్టులో స్పష్టంగా కనిపించింది...

విరాట్ కోహ్లీ లేకపోయినా అజింకా రహానే ఆ లోటు తెలియకుండా జట్టును నడిపించేవాడు. అయితే రహానే వైస్ కెప్టెన్సీ కోల్పోవడంతో సీన్ మారిపోయింది...

పెద్దగా కెప్టెన్సీ లక్షణాలు లేని కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం, అతను సారథిగా విఫలం కావడంతో టెస్టు సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది టీమిండియా...

వీటితో పాటు ఫామ్‌లో లేని అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలకు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూ... వారి భారాన్ని మోసి భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా...

రహానే, పూజారాల స్థానంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి వంటి ప్లేయర్లకు అవకాశం దక్కి ఉంటే, మిడిల్ ఆర్డర్‌లో అమూల్యమైన 50-60 పరుగులు వచ్చి ఉండేవి...

విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ స్టైల్‌ని మార్చుకుని మరీ అతి జాగ్రత్తతో బ్యాటింగ్ చేయడం కూడా భారత జట్టు విజయావకాశాలను దెబ్బ తీసిందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

కోహ్లీ తన సహజ శైలిలో బ్యాటింగ్ చేసి ఉంటే, కనీసం 30-40 పరుగులు ఎక్కువగా చేసేవాడని... అతని జిడ్డు బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్‌లో సరిగా వర్కవుట్ కాలేదని అంటున్నారు...

click me!