కేవలం ఆ ఇద్దరి వల్లే సిరీస్ ఓటమి... ఫామ్‌లో లేని సీనియర్ల బదులుగా అయ్యర్, విహారిలకు అవకాశం ఇచ్చి ఉంటే...

Published : Jan 14, 2022, 05:30 PM IST

సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటిదాకా టెస్టు సిరీస్ గెలవలేకపోయింది భారత జట్టు. అయితే ఈసారి ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా... సెంచూరియన్‌లో టెస్టు మ్యాచ్ కూడా గెలిచింది. అయితే ఆ తర్వాత సఫారీ జట్టు ఊహించిన కమ్‌బ్యాక్ ఇచ్చింది...

PREV
111
కేవలం ఆ ఇద్దరి వల్లే సిరీస్ ఓటమి... ఫామ్‌లో లేని సీనియర్ల బదులుగా అయ్యర్, విహారిలకు అవకాశం ఇచ్చి ఉంటే...

విరాట్ కోహ్లీ వెన్ను గాయంతో తప్పుకోవడంతో జోహన్‌బర్గ్‌లో తొలిసారి టీమిండియాను ఓడించి, సిరీస్ సమం చేసిన సౌతాఫ్రికా... కేప్‌ టౌన్ టెస్టులో విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది...

211

సొంతగడ్డపై, అనుకూలమైన పరిస్థితుల్లో సౌతాఫ్రికా బౌలర్లు అదరగొడితే... టీమిండియా బౌలర్ల నుంచి కూడా మంచి పర్ఫామెన్స్ వచ్చింది. బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ తమ శక్తిమేర రాణించారు..

311

అయితే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం సీనియర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేల పేలవమైన ఫామ్... వరుసగా ఫెయిల్ అవుతున్న ఈ ఇద్దరికీ, మళ్లీ మళ్లీ అవకాశాలు ఇచ్చి... ఏకంగా సిరీస్‌నే చేజార్చుకునే స్థితికి తెచ్చుకుంది భారత జట్టు...

411

ఛతేశ్వర్ పూజారా అటు బ్యాటింగ్‌తో పెద్దగా చేసిందేమీ లేదు, అదీకాకుండా ఫీల్డ్‌లోనూ కీలక సమయాల్లో ఈజీ క్యాచులను నెలవిడిచి, జట్టుకి తీవ్ర నష్టం చేకూర్చాడు...

511

కేప్ టౌన్ టెస్టులో అజింకా రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి చేసింది 10 పరుగులే. రహానే నుంచి కనీసం 50-60 పరుగులు వచ్చి ఉన్నా, ఇప్పుడు సీన్ వేరేగా ఉండేది...

611

తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకుపోయి జిడ్డు బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. అలాంటి సమయంలో అతనికి అవతలి ఎండ్‌కి సరైన సపోర్ట్ వచ్చి ఉంటే, టీమిండియా ఈజీగా 300+ స్కోరు చేసేది...

711

అయితే తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసి పర్వాలేదనిపించిన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో 33 బంతులాడి 9 పరుగులు చేసి అవుటైతే, రహానే 9 బంతులాడి 1 పరుగుకే పెవిలియన్ చేరాడు...

811

సీనియర్లే ఫెయిల్ అయిన చోట టెయిలెండర్ల నుంచి వచ్చిన అరా కొరా పరుగులతో సిరీస్ గెలవాలని అనుకుంటే అత్యాశే అవుతుంది... 

911

ఇలాంటి సిరీస్ పరాజయం తర్వాత అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలకు మరో అవకాశం ఇస్తారా? అనేది అనుమానమే. ఇస్తే మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది...

1011

ఓ రకంగా అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలకు ఇదే ఆఖరి సిరీస్ కావచ్చని కూడా భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ ఇద్దరి స్థానాల్లో శుబ్‌మన్ గిల్, హనుమ విహారి వంటి యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు...

1111

వచ్చే నెలలో శ్రీలంకతో స్వదేశంలో జరిగే రెండు టెస్టుల సిరీస్‌‌కి ప్రకటించే జట్టులో పూజారా, రహానే పేరు ఉంటే మాత్రం... ఫ్యాన్స్‌ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పడం కష్టమే..

click me!

Recommended Stories