వాళ్లని చూసి నవ్వుకుంటాం కానీ, పాక్ కంటే ఎక్కువ క్యాచులు డ్రాప్ చేస్తున్న టీమిండియా...

Published : Oct 06, 2022, 04:45 PM IST

క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగ్ కంటే ఫీల్డింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఫీల్డింగ్ బాగుంటే ఎంత తక్కువ స్కోరు చేసినా దాన్ని కాపాడుకుంటూ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఫీల్డింగ్ సరిగా లేక ఎన్నో మ్యాచుల్లో ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టును వెంటాడుతున్న సమస్యల్లో ఫీల్డింగ్ కూడా ఒకటి...

PREV
19
వాళ్లని చూసి నవ్వుకుంటాం కానీ, పాక్ కంటే ఎక్కువ క్యాచులు డ్రాప్ చేస్తున్న టీమిండియా...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా ఫీల్డర్లు చేస్తున్న తప్పులు, భారత క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆసియా కప్ 2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ డ్రాప్ చేసిన క్యాచ్... అతనిపై విద్వేషపూరిత పోస్టులు, కామెంట్లు రావడానికి కారణమైంది...

29

అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే కాదు.. ఈ నెల రోజుల్లో అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్... ఇలా చేతుల్లోకి వచ్చిన క్యాచులను నేలపాలు చేసిన ప్లేయర్ల సంఖ్య చాలా పెద్దగానే ఉంది...

39
Shubman Gill's catch

భారత జట్టులో అద్భుతమైన ఫీల్డర్లు అంటే రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలే. అయితే జడేజా గాయం కారణంగా భారత జట్టుకి కొన్ని నెలల పాటు దూరమయ్యాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న జడ్డూ, ఇప్పట్లో రీఎంట్రీ ఇవ్వడం కష్టమే...

49

వెన్నెముక సర్జరీ చేయించుకున్న హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 తర్వాత బ్యాటింగ్, బౌలింగ్‌లో మునుపటిలా మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం పాండ్యా ఇంతకుముందు చూపించిన వేగం చూపించడం లేదు. గాయపడతాననే భయమో, లేక గాయపడకూడదనే జాగ్రత్తో అతన్ని ఆపుతోంది...

59
Arshdeep Singh

వెన్నెముక సర్జరీ చేయించుకున్న హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 తర్వాత బ్యాటింగ్, బౌలింగ్‌లో మునుపటిలా మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం పాండ్యా ఇంతకుముందు చూపించిన వేగం చూపించడం లేదు. గాయపడతాననే భయమో, లేక గాయపడకూడదనే జాగ్రత్తో అతన్ని ఆపుతోంది...

69
Image credit: Getty

‘భారత జట్టు భారీ లక్ష్యాలు చేసినా వాటిని కాపాడుకోలేకపోతుంటే దానికి కారణం పేలవమైన బౌలింగ్, దారుణమైన ఫీల్డింగే. మనం పాకిస్తాన్‌ని చూసి నవ్వుకుంటాం కానీ, వాస్తవానికి వాళ్ల కంటే మన ఫీల్డర్లే ఎక్కువ క్యాచులను డ్రాప్ చేస్తున్నారు...

79
Arshdeep Singh-Sanju Samson

ఫీల్డింగ్‌లో చేస్తున్న తప్పులు బౌలర్లను దెబ్బ తీస్తున్నాయి. ఆరు క్యాచులు వస్తే అందులో నాలుగు మాత్రమే పట్టుకోగలుతున్నాం. అంటే గెలవడానికి వచ్చే మరో రెండు అవకాశాలను నేలపాలు చేస్తున్నాం...

89
suresh

భారత జట్టు ఈ మధ్యకాలంలో 75.8 క్యాచులను సక్సెస్‌ఫుల్‌గా అందుకోగలిగింది. శ్రీలంక మాత్రమే 74.3 క్యాచ్ సక్సెస రేటుతో మనకంటే దారుణంగా ఉంది. అయితే వాళ్లు ఆసియా కప్ 2022 టోర్నీలో టాప్ క్లాస్ ఫీల్డింగ్ పర్ఫామెన్స్ చూపించారు...

99
Ravindra Jadeja catch

సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా... గన్ ఫీల్డర్లుగా ఉండేవారు. వీళ్ల ఫీల్డింగ్ చూస్తుంటే... ‘‘వావ్... వాట్ ఏ ఫీల్డర్’ అనుకునేవాళ్లం. ఇప్పుడు అలాంటి వాళ్లు టీమ్‌లో కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా... 

click me!

Recommended Stories