సూర్యభాయ్‌ని వెంటాడిన బ్యాడ్‌లక్... నెం.1 ర్యాంకుకి ఎగబాకి, రెండు రోజుల్లోనే...

Published : Oct 06, 2022, 02:58 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియాకి ఆశాకిరణంగా మారాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది సంచలన ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్‌గా మారాడు. అయితే కొన్ని గంటల్లోనే సూర్యని బ్యాడ్‌లక్ వెంటాడింది...

PREV
17
సూర్యభాయ్‌ని వెంటాడిన బ్యాడ్‌లక్... నెం.1 ర్యాంకుకి ఎగబాకి, రెండు రోజుల్లోనే...
Image credit: PTI

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ మధ్యలోనే టాప్ 2 ర్యాంకులోకి ఎగబాకాడు సూర్యకుమార్ యాదవ్. అయితే మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కి రెస్ట్ ఇవ్వడంతో ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ అయ్యే అవకాశాన్ని  తృటిలో మిస్ చేసుకున్నాడు...

27
Image credit: PTI

తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచుల్లో సెన్సేషనల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. తొలి టీ20లో 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, రెండో టీ20లో 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు...

37

ఈ పర్ఫామెన్స్ కారణంగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ని వెనక్కినెట్టిన సూర్యకుమార్ యాదవ్, టాప్ ర్యాంకుని అధిరోహించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 854 పాయింట్లు సాధించిన సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు...

47

విరాట్ కోహ్లీ టీ20 ర్యాంకింగ్స్‌లో 897 పాయింట్లు సాధించగా సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ 854 పాయింట్లు సాధించి తర్వాతి ప్లేస్‌లో ఉన్నారు. యువరాజ్ సింగ్ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 793 పాయింట్లు సాధించాడు...

57

గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ తర్వాత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ని దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. అయితే బుధవారం టాప్ పొజిషన్‌కి వెళ్లిన సూర్య భాయ్, రెండు రోజుల్లోనే ఆ ర్యాంకును కోల్పోయాడు...

67
Suryakumar Yadav

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 6 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 18 పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. సూర్య మరో 14+ పరుగులు చేసినా లేక, రెండో టీ20లో రనౌట్ రూపంలో అవుట్ కాకుండా మరో 30+ చేసి ఉన్నా... తన టాప్ ప్లేస్‌ని నిలబెట్టుకునేవాడు...

77
Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదలయ్యేవరకూ పాకిస్తాన్, ఇండియా టీ20 సిరీస్‌లు ఆడడం లేదు. దీంతో ఈ రెండు జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్... సూర్యభాయ్ వర్సెస్ మహ్మద్ రిజ్వాన్ మ్యాచ్‌గానూ మారనుంది... 
 

click me!

Recommended Stories