మేం వాళ్లలా ఆడాలని అనుకున్నాం, అయితే ఈ ఫార్మాట్‌లో హీరోలు... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్...

First Published Aug 17, 2021, 12:07 PM IST

టీమిండియా జోరు ముందు మొదటి రెండు టెస్టుల్లో నిలవలేకపోయింది ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు. తొలి టెస్టులో వర్షం కారణంగా ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లాండ్... లార్డ్స్ టెస్టులో టీమిండియాను రెచ్చికొట్టి, వారి చేతుల్లో చిత్తుగా ఓడింది...

ఈ మ్యాచ్‌కి ముందు జో రూట్ సెంచరీ చేసిన ఏ టెస్టులోనూ ఇంగ్లాండ్ జట్టు ఓడిపోలేదు. 21 సెంచరీల్లో 15 మ్యాచుల్లో ఇంగ్లాండ్ జట్టు విజయం అందుకోగా, ఆరు మ్యాచులు డ్రాగా ముగిశాయి... ఐదో రోజు ఉదయం సెషన్‌లో డేంజరేస్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వికెట్ తీసిన తర్వాత ఆ మ్యాచ్‌లో విజయం సాధించినట్టే భావించింది ఇంగ్లాండ్...

అయితే ఇషాంత్ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన జస్ప్రిత్ బుమ్రాపై నోరు పారేసుకుని, బౌన్సర్లతో రెచ్చిగొట్టి... భారీ మూల్యం చెల్లించుకుంది. 9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మహ్మద్ షమీ... ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ల మధ్య సమాధానం లేకపోయింది...

రెండో టెస్టులో పరాజయం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. ‘విరాట్ కోహ్లీకి ఓ సెపరేట్ స్టైల్ ఉంది. అది ఇప్పుడు టీమిండియాలో ప్రతీ ప్లేయర్‌లో కనిపిస్తోంది. టీమిండియా ఆడిన తీరు, మా సహజమైన ఆటతీరును దెబ్బతీసింది...

టెస్టు ఫార్మాట్‌లో టీమిండియా చాలా అద్భుతమైన టీమ్. ఐదో రోజు ఆరంభంలో మేం మంచి పొజిషన్‌లో ఉన్నామని అనుకున్నాం. రిషబ్ పంత్ వికెట్ పడిన తర్వాత మేం గెలవబోతున్నామనే భావించాం...

అయితే ఎమోషనల్‌ బాటిల్‌లో మేం ఓడిపోయాం... అయితే ఇది అప్పుడే అయిపోలేదు. ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి. సిరీస్ గెలిచేందుకు మాకు ఇంకా సమయం, అవకాశాలు ఉన్నాయి... ఈ మ్యాచ్‌లో కూడా మేం మొదటి నాలుగు రోజులు చాలా చక్కని క్రికెట్ ఆడాం...

అయితే ఆఖరి రోజు ఆటను టీమిండియా డామినేట్ చేసింది. మేం వాళ్లలా ఆడాలని అనుకున్నాం, కానీ వాళ్లు గెలిచి హీరోలుగా నిరూపించుకున్నారు... ఇది ఇంకా అయిపోలేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్... 

click me!