T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల... మొదటి మ్యాచ్‌లోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్...

First Published Aug 17, 2021, 11:16 AM IST

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది ఐసీసీ. టీమిండియా, టీ20 వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలబడబోతోంది... యూఏఈ, ఓమన్ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ పూర్తి షెడ్యూల్ ఇదే...

అక్టోబర్ 17న ఓమన్ వేదికగా ఓమన్ వర్సెస్ పపువా న్యూ గినీ, బంగ్లాదేశ్ వర్సెస్ స్కాంట్లాండ్ మ్యాచులతో టీ20 వరల్డ్‌కప్ మొదలవుతుంది. అక్టోబర్ 18న అబుదాబిలో ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్, శ్రీలంక వర్సెస్ నమీబియా మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత 19న స్కాట్లాండ్ వర్సెస్ పపువా న్యూ గినీ, ఓమన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచులు ఉంటాయి...

అక్టోబర్ 20న నమీబియా వర్సెస్ నెదర్లాండ్స్, శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ మ్యాచులు అబుదాబీ వేదికగా జరుగుతాయి. ఆ తర్వాత 21న బంగ్లాదేశ్ వర్సెస్ పపువా న్యూ గినీ, ఓమన్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచులు ఓమన్ వేదికగా... 22న అక్టోబర్‌న షార్జా వేదికగా నమీబియా వర్సెస్ ఐర్లాండ్, శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్ మ్యాచులు జరుగుతాయి...

ఆ తర్వాత అక్టోబర్ 23న అబుదాబీ వేదికగా జరిగే ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచులతో సూపర్ 12 మ్యాచులు మొదలవుతాయి... గ్రూప్ స్టేజ్‌లో రెండు గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన రెండేసి జట్లు.... సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. 

దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో మ్యాచ్ జరుగుతుంది...

నవంబర్ 3న అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడే టీమిండియా... నవంబర్ 5న గ్రూప్ స్టేజ్‌ నుంచి అర్హత సాధించే జట్టుతో తలబడుతుంది...

నవంబర్ 3న అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడే టీమిండియా... నవంబర్ 5న గ్రూప్ స్టేజ్‌ నుంచి అర్హత సాధించే జట్టుతో తలబడుతుంది...

సెమీ ఫైనల్-1 మొదటి మ్యాచ్ నవంబర్ 10న అబుదాబీ వేదికగా... రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 11న దుబాయ్ వేదికగా జరుగుతుంది. వర్షం కారణంగా లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా ఈ సెమీ ఫైనల్ మ్యాచులకు అంతరాయం కలిగితే ముందు జాగ్రత్తగా మరో రిజర్వు డేలను కూడా కేటాయించింది ఐసీసీ...

నవంబర్ 14న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కి కూడా ఓ రిజర్వు డే ఉంటుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచులన్నీ మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతాయి... 

click me!