Ben Stokes: మేమేం కార్లు కాదు.. పెట్రోల్ నింపి ఎక్కడికిపడితే అక్కడికి వెళ్లడానికి.. బిజీ షెడ్యూల్ పై స్టోక్స్

Published : Jul 20, 2022, 11:18 AM IST

Ben Stokes: తీరిక లేని క్రికెట్ కారణంగా తాము అలిసిపోతున్నామని  ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు వాపోతున్నారు. ఐసీసీ, వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమ స్వలాభం కోసం ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. 

PREV
16
Ben Stokes: మేమేం కార్లు కాదు.. పెట్రోల్ నింపి ఎక్కడికిపడితే అక్కడికి వెళ్లడానికి.. బిజీ షెడ్యూల్ పై స్టోక్స్

31 ఏండ్లకే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఇంగ్లాండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్.. క్రికెట్ బోర్డులు, ఐసీసీ ప్రకటిస్తున్న బిజీ షెడ్యూల్స్ పై నేరుగా విమర్శలు సంధించాడు. తామేం వాహనాలు కాదని.. తామూ అలిసిపోతామని ఆవేదన వ్యక్తం చేశాడు. 

26

మంగళవారం దక్షిణాఫ్రికాతో తన హోంగ్రౌండ్ (డర్హమ్) లో చివరి వన్డే ఆడిన బెన్ స్టోక్స్.. మ్యాచ్ అనంతరం బీబీసీ నిర్వహించిన టెస్ట్ మ్యాచ్ స్పెషల్  కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ  సందర్బంగా స్టోక్స్ ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు.
 

36

స్టోక్స్ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ నా జట్టుకు వందశాతం ఇవ్వాలని కోరుకుంటా. కానీ మేం కార్లు కాదు కదా. పెట్రోల్ నింపి వెళ్లమనడానికి.. ఆట, ప్రయాణాల వల్ల ఏర్పడిన అలసట మాపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. నేనిదివరకే చెప్పినట్టు ఇది బిజీ షెడ్యూల్.. అంతేగాక ఆటగాళ్లను వందశాతం ఇవ్వమని కోరుతున్నది. అది చాలాకష్టం..’ అని అన్నాడు. 

46

ఇంకా అతడు స్పందిస్తూ..‘జట్లు కూడా ఆయా ఆటగాళ్లకు ఎక్కడ విరామమివ్వాలో తేల్చుకోలేకపోతున్నాయి. ఒకవేళ మీకు బెస్ట్  ప్రోడక్ట్ రావాలంటే మీరు బెస్ట్ ఆటగాళ్లను తయారుచేసుకోవాలి. ఇది బాగా అనిపించడం లేదు.  మేము ఒక టెస్ట్ మ్యాచ్ ఆడటం, వన్డే జట్టు కూడా ఒకే సమయంలో ఆడటం నేను చూస్తున్నాను. దాని గురించి ఆలోచించడం వింతగా ఉంది..’ అని స్టోక్స్ తెలిపాడు. 
 

56

ఇక తన చివరి వన్డేలో స్టోక్స్.. 5 పరుగులే చేసి నిష్క్రమించాడు. 11 బంతులాడిన అతడు..  మార్క్రమ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించాడు.  స్టోక్స్ ఔటై పెవిలియన్ చేరేప్పుడు స్టేడియమంతా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. 

66

ఇక దక్షిణాఫ్రికాతో  జరిగిన వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్..  62 పరుగుల  తేడాతో ఓడింది.  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేశారు. అనంతరం ఇంగ్లాండ్.. 46.5 ఓవర్లలో271 పరుగులకే ఆలౌట్ అయింది. 

click me!

Recommended Stories