ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అర్ధాంతరంగా వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడం ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్‌కి గురి చేసింది. బిజీ షెడ్యూల్ కారణంగా మూడు ఫార్మాట్లు ఆడలేనంటూ బెన్ స్టోక్స్ తీసుకున్న నిర్ణయంపై తనదైన స్టైల్‌లో స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...
ఇంగ్లాండ్ తరుపున 104 టెస్టులు, 136 వన్డేలు ఆడిన కేవిన్ పీటర్సన్, మొత్తంగా 32 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలతో 12500లకు పైగా అంతర్జాతీయ పరుగులు చేశాడు...
26
37 టీ20 మ్యాచులు ఆడిన కేవిన్ పీటర్సన్, 7 హాఫ్ సెంచరీలతో 1176 పరుగులు చేశాడు. టీ20ల్లో కేవిన్ పీటర్సన్ సగటు 37.93 కాగా స్ట్రైయిక్ రేటు 141కి పైనే ఉంది...
36
బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్ తర్వాత ‘నేను ఒకప్పుడు షెడ్యూల్ భయంకరంగా ఉంది, మూడు ఫార్మాట్లు ఆడలేనని చెప్పి వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నా.. అయితే ఈసీబీ నన్ను టీ20ల నుంచి కూడా బ్యాన్ వేసింది...’ అంటూ నవ్వుతున్న ఏమోజీ జత చేశాడు కేవిన్ పీటర్సన్...
46
ఓ క్రికెట్ ఫ్యాన్స్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ట్వీట్‌కి ‘నువ్వు చాలా ఏళ్ల క్రితం ఆడావు? ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయి ఉంటాయి కదా...’ అంటూ కామెంట్ చేశాడు. దానికి ‘నేను వాటిని మార్చాను...’ అంటూ సమాధానం ఇచ్చాడు కేవిన్ పీటర్సన్...
56
ఇంగ్లాండ్ క్రికెట్‌కి కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా సేవలు అందించిన కేవిన్ పీటర్సన్, కెరీర్ చివర్లో టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడా? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చను లేవనెత్తుతోంది...
66
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి, బెన్ స్టోక్స్ వన్డేల్లో రిటైర్మెంట్ తీసుకోవడానికి ఈసీబీ నిర్ణయాలు, బిజీ షెడ్యూలే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి..