అతన్ని తప్పించకపోవడమే మేం చేసిన పెద్ద తప్పు... అందుకే విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారేమో...

Published : Jul 19, 2022, 06:16 PM IST

భారత టీ20 టీమ్‌లో విరాట్ కోహ్లీ ప్లేస్ గురించి చాలా పెద్ద చర్చే జరుగుతోంది. ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని ఆడించడం కంటే ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్లను ఆడించాలంటూ భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాయి...

PREV
110
అతన్ని తప్పించకపోవడమే మేం చేసిన పెద్ద తప్పు... అందుకే విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారేమో...

కపిల్‌దేవ్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, పార్థివ్ పటేల్ కూడా టీ20ల్లో విరాట్ కోహ్లీని కొనసాగించడం కంటే దీపక్ హుడాకి అవకాశం ఇవ్వడం బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు...

210

తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఇంగ్లాండ్ మాజీ బౌలింగ్ కోచ్ ముస్తాక్ అహ్మద్ కూడా విరాట్ కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు... ఫామ్‌లో లేని ప్లేయర్‌ని కొనసాగించి ఇంగ్లాండ్ చేసిన తప్పు, టీమిండియా చేయొద్దంటూ హెచ్చరించాడు...

310

2008 నుంచి 2014 వరకూ ఇంగ్లాండ్ జట్టుకి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన ముస్తాక్ అహ్మద్... ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్‌ని ఉదాహరణగా పేర్కొంటూ విరాట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు...

410
Virat Kohli

‘విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ ప్లేయర్లలో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. జొనాథన్ ట్రాట్ ఆరంభంలో ఇంగ్లాండ్‌తో బోలెడన్ని పరుగులు చేసి కీ ప్లేయర్‌గా మారిపోయాడు..

510

అయితే ఓ స్టేజ్ తర్వాత అతను పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, మైండ్‌సెట్, ఇంకా ఏవేవో కారణాలు... అతను పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డాడు...

610
Virat Kohli

అయితే అతన్ని మేం టీమ్ నుంచి తప్పించలేదు. అదే మేం చేసిన అతి పెద్ద తప్పు... ఇప్పుడు విరాట్ కోహ్లీకి మూడు నాలుగు నెలల విశ్రాంతి అవసరం. అతన్ని తప్పిస్తారా? లేక రెస్ట్ ఇస్తారా? తెలీదు... 

710

ఇంట్లో కూర్చొని టీమ్ మేట్స్ ఆట చూస్తుంటే మనలో తెలియని పాజిటివిటీ పెరుగుతుంది. టీమ్‌లోకి ఎలాగైనా రావాలనే కసి పెరుగుతుంది. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి, దాన్ని సరిదిద్దుకోవడానికి కావాల్సనంత సమయం దొరుకుతుంది...

810

ఓ మూడు నెలల తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి వస్తే... అతను వన్డేల్లో 40కి పైగా సెంచరీలు చేశాడని, టెస్టుల్లో 27 సెంచరీలు చేశాడనే విషయం మరిచిపోయి... ఓ కొత్త ఫీలింగ్‌తో ఆడతాడు.. 

910
Image Credit: Getty Images

మళ్లీ మొదటి నుంచి మొదలెట్టినప్పుడు ఆటగాడికి కావాల్సినంత సమయం దొరుకుతుంది. ప్రతీ షాట్‌ని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం మరింత రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు విరాట్‌కి అలాంటి ఆకలి అవసరం..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్, ఇంగ్లాండ్ మాజీ బౌలింగ్ కోచ్ ముస్తాక్ అహ్మద్... 

1010

ఇంగ్లాండ్ తరుపున 52 టెస్టులు, 68 వన్డేలు ఆడిన జొనాథన్ ట్రాట్, 13 సెంచరీలతో 7600లకు పైగా చేశాడు...  2013 నవంబర్‌లో యాషెస్ సిరీస్ మధ్యలో స్ట్రెస్, యాంక్సైటీ వంటి మానసిక సమస్యలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు జొనాథన్ ట్రాట్... ఆ తర్వాత 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చి రిటైర్మెంట్ ప్రకటించాడు...

Read more Photos on
click me!

Recommended Stories