మన అదృష్టం, వాళ్లకి జ్వరం వచ్చింది! లేదంటేనా... ఇంగ్లాండ్ వీరకొట్టుడుపై షోయబ్ అక్తర్ కామెంట్...

First Published Dec 2, 2022, 11:32 AM IST

17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు, రావల్పిండి టెస్టులో పైచేయి సాధించింది. పాక్‌లో అడుగుపెట్టిన తర్వాత వైరస్ బారిన పడి, అనారోగ్యానికి గురైన ఇంగ్లాండ్ ప్లేయర్లు, టెస్టు ఆరంభానికి ముందు కోలుకుని బరిలో దిగారు... ప్రాక్టీస్ లేకుండానే నేరుగా క్రీజులో దిగారు.. 

టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 500 కొట్టాలంటే ఛతేశ్వర్ పూజారా, రాహుల్ ద్రావిడ్ వంటి ప్లేయర్లు కనీసం రెండు రోజులు, మూడు రోజుల సమయం తీసుకునేవాళ్లు! అయితే ఒకే రోజు, మూడు సెషన్లలోనే 500+ కొట్టేసి పాకిస్తాన్‌కి ఊహించని షాక్ ఇచ్చారు ఇంగ్లాండ్ బ్యాటర్లు... వచ్చినవాళ్లు వచ్చినట్టు సెంచరీలు బాదేసి వెళ్లారు...

Image credit: Getty

శతాబ్దాల చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకూ ఏ జట్టూ కూడా తొలి రోజే 500+ కొట్టలేదు. అయితే పీసీబీ చేసిన కక్కుర్తి పని వల్ల ఇంగ్లాండ్ జట్టు ఆ ఘనత సాధించేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది...

Pakistan vs England

జాక్ క్రావ్లే 122, బెన్ డక్లెట్ 107, ఓల్లీ పోప్ 108, హారీ బ్రూక్ 153 పరుగులు చేసి సెంచరీల మోత మోగించారు. టెస్టు మాజీ కెప్టెన్ జో రూట్ 23, తాజా కెప్టెన్ బెన్ స్టోక్స్ 41 పరుగులు చేయగా తొలి టెస్టు ఆడుతున్న లియామ్ లివింగ్‌స్టోన్ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్  ‘బజ్ బాల్’ థియరీకి కరెక్టుగా సెట్ అయ్యేలా పిచ్‌ని రూపొందించింది పాక్ క్రికెట్ బోర్డు...

‘మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే... ఇంగ్లాండ్ టీమ్‌ అస్వస్థతకు గురైంది. వాళ్లు అనారోగ్యంతోనే ఇలా కొట్టారంటే, ఇంకా పూర్తి ఫిట్‌గా ఉండి ఉంటే చితక్కొట్టేవాళ్లు. మన పరువుని ముంచేసేవాళ్లు. టెస్టు క్రికెట్‌లో స్లోగా బ్యాటింగ్ చేయాలనే సిద్ధాంతానికి బ్రెండన్ మెక్‌కల్లమ్ పూర్తిగా వ్యతిరేకం. అతని సిద్ధాంతం బాదడమే....

Image credit: Getty

బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచ్‌గా వచ్చాక ఇంగ్లాండ్ టీమ్‌ కూడా ఇలాగే తయారైంది. ప్లేయర్లకు ప్రతీ బాల్ బాదమని చెప్పి పంపుతున్నట్టు ఉన్నాడు. ఇలా ఆడుతుంటే ఏ బౌలర్ అయినా ఏం చేయగలడు.. లియామ్ లివింగ్‌స్టోన్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడంటే వారి బ్యాటింగ్ ఆర్డర్‌ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు...

ఇప్పుడు ఇంగ్లాండ్‌పై పైచేయి సాధించాలంటే పాకిస్తాన్ ఆటతీరు కూడా మారాలి. ఇప్పుడు పాక్ టీమ్‌లో చాలామంది కొత్త కుర్రాళ్లే ఉన్నారు. వాళ్లకు ఇది విలువైన పాఠం అవుతుంది. మన పిల్లల్ని ఇంత దారుణంగా కొట్టడానికి కారణం పీసీబీయే. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చెత్త పిచ్ తయారుచేశారు.. ’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్... 

click me!