ఒకే మ్యాచ్ ఆడిన సంజూకీ, ఫామ్‌లో ఉన్న సూర్యకు రెస్ట్! మరి పంత్‌కి వద్దా? బీసీసీఐ డబుల్ స్టాండర్డ్స్‌?

First Published Dec 2, 2022, 11:00 AM IST

సంజూ శాంసన్, ఇప్పుడు టీమిండియాలో మోస్ట్ క్రేజ్ సంపాదించుకున్న క్రికెటర్. సాధారణంగా ఏ ప్లేయర్ అయినా బాగా ఆడి రికార్డులు బ్రేక్ చేసి అభిమానులను సంపాదించుకుంటారు. కానీ సంజూ శాంసన్ మాత్రం రివర్స్‌లో రిజర్వు బెంచ్‌లో కూర్చుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. 

Sanju Samson Rishabh Pant

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ నుంచి న్యూజిలాండ్ టూర్‌లో జరిగిన ఆరు మ్యాచుల్లో సంజూ శాంసన్‌కి ఒకే ఒక్క మ్యాచ్ ఆడించి మిగిలిన మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. కనీసం ఈ మ్యాచుల్లో రిషబ్ పంత్ బాగా ఆడినా... శాంసన్ గురించి ఇంత చర్చ జరిగేది కాదేమో...

Sanju Samson-Rishabh Pant

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో రెండు మ్యాచుల్లో రెండింట్లోనూ కలిపి పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయిన రిషబ్ పంత్, న్యూజిలాండ్‌ టూర్‌లో టీ20 సిరీస్‌లో, వన్డే సిరీస్‌లోకలిపి కూడా 40+ పరుగులు చేయలేకపోయాడు. ఆడిన ఒక్క మ్యాచ్‌లో సంజూ శాంసన్ 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...

Sanju Samson

అయితే ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సంజూ శాంసన్‌కి బంగ్లాదేశ్ టూర్ నుంచి విశ్రాంతి కల్పించింది బీసీసీఐ. విశ్రాంతి ఇచ్చింది అనేకంటే జట్టు నుంచి తప్పించింది అనడమే కరెక్ట్.. 

అలాగే టీ20 సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్‌కి కూడా బంగ్లా టూర్ నుంచి రెస్ట్ ఇచ్చింది. ఈ రెండూ బాగానే ఉన్నా రిషబ్ పంత్‌ మాత్రం ఈ టూర్‌లో వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడబోతున్నాడు...

rishabh pant

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్, ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి టీమ్‌తో కొనసాగుతూ ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీతో పాటు న్యూజిలాండ్ టూర్‌కి కూడా వెళ్లాడు. అటు నుంచి బంగ్లాదేశ్ పర్యటనకి వస్తున్నాడు...

Rishabh Pant

సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లకు రెస్ట్ ఇచ్చినప్పుడు రిషబ్ పంత్‌కి కూడా కాస్త బ్రేక్ ఇవ్వాలి కదా.. ఎందుకివ్వడం లేదని నిలదీస్తున్నారు అభిమానులు. రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇచ్చి, బంగ్లా టూర్‌లో సంజూ శాంసన్‌కి అవకాశం ఇచ్చి ఉంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కావు కదా... అంటూ కామెంట్లు చేస్తున్నారు... 

click me!