డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతున్నాం! బాబర్ ఆజమ్ కామెంట్స్... లక్కీగా వరల్డ్ కప్ ఫైనల్ ఆడినట్టు కాదంటూ...

First Published Dec 1, 2022, 12:56 PM IST

అదృష్టం కలిసొచ్చి, టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ ఆడిన పాకిస్తాన్... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలని కలలు కంటోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పాక్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి, ఫైనల్ రేసులో ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది... 

Image credit: Getty

ఇండియా, జింబాబ్వే చేతుల్లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ ఆడగలిగింది పాకిస్తాన్ జట్టు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడిపోవడంతో లక్ ఈడ్చి పెట్టి తన్నడంతో వెళ్లి సెమీ ఫైనల్ బుట్టలో పడింది పాకిస్తాన్. సెమీస్‌లో న్యూజిలాండ్‌ని ఓడించి ఫైనల్ చేరింది...

Babar Azam

అయితే ఫైనల్ దాకా వచ్చేందుకు సాయపడిన అదృష్టం, ఫైనల్‌లో మాత్రం కలిసి రాలేదు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ని 3 -0 లేదా 2-0 తేడాతో గెలిస్తే.. ఫైనల్ రేసులో నిలబడేందుకు పాకిస్తాన్‌కి ఛాన్సులు ఉంటాయి...

Babar Azam

‘మేం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఆశగా ఎదురుచూస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన సిరీస్. వచ్చే ఐదు టెస్టుల్లో మేం నాలుగు గెలిచినా, ఫైనల్ ఆడేందుకు అవకాశం ఉంటుంది.. ఈ సిరీస్‌కి ముందు మాకు కావాల్సినంత విశ్రాంతి సమయం దొరికింది...

Babar Azam

మా టీమ్‌లో కొందరు ఇప్పటికే ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి రెడ్ బాల్ క్రికెట్‌కి కావాల్సిన ప్రాక్టీస్ సంపాదించుకున్నారు. మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాం. నసీం షా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు... మేం ఈ టెస్టు సిరీస్ గెలుస్తామనే నమ్మకం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్...

17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు, తొలి టెస్టు ఆరంభానికి ముందు అనారోగ్యానికి గురైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు 11 మంది ప్లేయర్లు అస్వస్థతకు గురయ్యారు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు పరిస్థితి కుదుటపడడంతో మ్యాచ్ సజావుగా ప్రారంభమైంది...

బెన్ స్టోక్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ‘బజ్ బాల్’ కాన్సెప్ట్‌తో దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్, రావల్పిండి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జాక్ క్రావ్లే, బెన్ డక్లెట్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 27 ఓవర్లలో 174 పరుగులు చేసింది ఇంగ్లాండ్... 

Image credit: Getty

డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌లో ఇంగ్లాండ్ వరుస పరాజయాలు అందుకుంది. అయితే బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక సీన్ మారింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఓడించిన ఇంగ్లాండ్, గత 7 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంది. అలాంటి ఇంగ్లాండ్‌ని 2-0 తేడాతో ఓడించడం పాక్‌ వల్ల అయ్యే పనేనా? అనేది క్రికెట్ ఫ్యాన్స్ అనుమానం... 

click me!