జస్ప్రిత్ బుమ్రా ఆడకపోతే ఆ కుర్రాడిని వరల్డ్ కప్‌లో ఆడించాలి! - రవిచంద్రన్ అశ్విన్

Published : Jul 01, 2023, 03:33 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది టీమిండియా. విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన అశ్విన్, ఎలాంటి ప్రెషర్ తీసుకోకుండా అద్భుతంగా ఆడాడు..

PREV
18
జస్ప్రిత్ బుమ్రా ఆడకపోతే ఆ కుర్రాడిని వరల్డ్ కప్‌లో ఆడించాలి! - రవిచంద్రన్ అశ్విన్
India vs Pakistan

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ని వైట్ బాల్ క్రికెట్‌కి దూరంగా పెట్టింది టీమిండియా. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో కూడా ఆడని అశ్విన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడే అవకాశం లేదు..

28
Jasprit Bumrah

‘ఐసీసీ ఈవెంట్లలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన గత కొన్ని మ్యాచులు అద్భుతంగా జరిగాయి. ఈసారి కూడా అలాంటి బ్లాక్‌ బస్టర్ ఇండియా-పాకిస్తాన్ రావచ్చు. ఎందుకంటే ఇరుజట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి..

38
Jasprit Bumrah

పాకిస్తాన్ పేస్ బౌలింగ్‌ యూనిట్ చాలా బలంగా ఉంది. ఇండియా పరిస్థితి చూస్తే జస్ప్రిత్ బుమ్రా ఆడతాడని ఆశిస్తున్నాం. అతను ఆడకపోతే మాత్రం ప్రసిద్ధ్ కృష్ణని ఆడించాలి. టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..

48
Prasidh Krishna

పాకిస్తాన్ పేస్ బౌలింగ్‌ యూనిట్ చాలా బలంగా ఉంది. ఇండియా పరిస్థితి చూస్తే జస్ప్రిత్ బుమ్రా ఆడతాడని ఆశిస్తున్నాం. అతను ఆడకపోతే మాత్రం ప్రసిద్ధ్ కృష్ణని ఆడించాలి. టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..

58

అక్టోబర్ 15న స్టేడియం హౌస్ ఫుల్ అయిపోతుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో 1 లక్షా 30 వేల మంది అభిమానులు నిండిపోతారు. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా అహ్మదాబాద్‌లో మాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.. ఆస్ట్రేలియాని ఇక్కడే ఓడించాం..
 

68

ఆ తర్వాత పాకిస్తాన్‌పై సెమీ ఫైనల్‌లో గెలిచి, ఫైనల్‌లో గెలిచి టైటిల్ సాధించాం.. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో మహ్మద్ షమీ, శుబ్‌మన్ గిల్ అదరగొట్టారు. హార్ధిక్ పాండ్యా కూడా ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు..

78

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచి బౌలింగ్ చూపించాడు. చాలా తక్కువ టార్గెట్‌ని డిఫెండ్ చేసుకోగలిగాం. ఈసారి టాస్‌, మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయకూడదని కోరుకుంటున్నా. 

88

గత కొన్ని ఐసీసీ టోర్నీల్లో టాస్ గెలిచిన టీమే, మ్యాచులు గెలుస్తూ వస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...

click me!

Recommended Stories