ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా 95 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతున్న భారత జట్టు, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో పాల్గొనబోతోంది. అయితే టీమిండియాని రెండేళ్లుగా గాయాలు వెంటాడుతున్నాయి..
సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ప్రస్తుతం టీమ్‌కి దూరంగా ఉన్నారు. వరల్డ్ కప్ సమయానికి వీరిలో ఎంతమంది పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారనేది ఇప్పుడే చెప్పడం కష్టం..
28
దీంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయడం, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రావడం దాదాపు ఖాయమైపోయినట్టే. ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ ఆర్డర్ పేపర్ మీద పటిష్టంగానే కనిపిస్తోంది..
38
Image credit: PTI
అయితే వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయడం వల్ల టీమిండియాకి విజయం దక్కదని అంటున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. 2011 వన్డే వరల్డ్ కప్ విజయానికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలే కారణమని అంటున్నాడు శాస్త్రి..
48
Image credit: Getty
‘ఓపెనర్లుగా ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్లనే పంపితే, బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. టీమ్ కాంబినేషన్ మాత్రమే కాదు, రైట్ హ్యాండ్ - లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా చాలా అవసరం. టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్లు అవసరం..
58
Image credit: PTI
కనీసం టాప్ 6లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు అయినా కావాలి. టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలిచిన ప్రతీసారీ ఇదే వర్కవుట్ అయ్యింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా కీ రోల్ పోషించారు..
68
Image credit: PTI
1974లో అల్విన్ కల్లిచరణ్, రాయ్ ఫ్రెండ్రిక్స్, క్లెవ్ లాయిడ్ వంటి లెఫ్ట్ హ్యాండర్లే టీమ్‌కి వరల్డ్ కప్ అందించారు. 1983 టీమ్ ఒక్కటే లెఫ్ట్ హ్యాండర్ లేకుండా వరల్డ్ కప్ గెలిచింది. అయితే అప్పుడు ఆ టీమ్ ఎన్నో ఇబ్బందులను, కష్టాలను అధిగమించి విజయం అందుకుంది..
78
1987లో అలెన్ బోర్డర్‌తో పాటు టాపార్డర్‌లో ఇద్దరు ముగ్గరు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. 1996లో సనత్ జయసూర్య, అర్జున రణతుంగ, అసంక గురుసిన్హా, ఆ తర్వాత ఆస్ట్రేలియా విజయాల్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్... ఇలా లెఫ్ట్ హ్యాండర్లే వరల్డ్ కప్ అందించారు.. ’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...
88
Ravi Shastri
ఇంతకుముందు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వన్డేల్లో ఓపెనింగ్ చేసేవాళ్లు. అయితే ధావన్‌ని ఇప్పుడు పూర్తిగా పక్కనబెట్టేసిన సెలక్టర్లు, ఇషాన్ కిషన్‌కి అవకాశం ఇచ్చారు. ఫిట్‌గా ఉన్న ప్లేయర్లలో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే రవీంద్ర జడేజా ఒక్కడే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్...