ధోనీ కెప్టెన్సీ చూసి మెంటల్ ఎక్కేసింది! రిప్లై చూసినట్టుగా ఫీల్డర్లను మారుస్తాడు... - వెంకటేశ్ అయ్యర్

Published : Jul 01, 2023, 03:00 PM ISTUpdated : Jul 01, 2023, 03:02 PM IST

ఐపీఎల్ 2021లో అరసీజన్ ఆడి, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ని ఫైనల్ చేర్చాడు కేకేఆర్‌ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్. ఆ పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి కూడా వచ్చిన అయ్యర్, పెద్దగా మెప్పించలేకపోయినా.. కేకేఆర్‌లో కీ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు...

PREV
17
ధోనీ కెప్టెన్సీ చూసి మెంటల్ ఎక్కేసింది! రిప్లై చూసినట్టుగా ఫీల్డర్లను మారుస్తాడు... - వెంకటేశ్ అయ్యర్

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇచ్చిన హాఫ్ సీజన్ పర్ఫామెన్స్ కారణంగా శుబ్‌మన్ గిల్, లూకీ ఫర్గూసన్ వంటి ప్లేయర్లను కూడా వేలానికి వదిలేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, వెంకటేశ్ అయ్యర్‌ని రిటైన్ చేసుకుంది..
 

27
Venkatesh Iyer

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫెయిల్ అయినా 2023 సీజన్‌లో సెంచరీ బాదిన వెంకటేశ్ అయ్యర్, 2008లో బ్రెండన్ మెక్‌కల్లమ్ తర్వాత కోల్‌కత్తా తరుపున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

37

‘ఐపీఎల్ 2021 సీజన్‌లో నేను, ఇంకో బ్యాటర్ కలిసి బ్యాటింగ్ చేస్తున్నాం. ఆఫ్ సైడ్ ఓ షార్ట్ థర్డ్ మ్యాన్‌తో పాటు కవర్స్‌లో మరో ఫ్లేయర్‌న పెట్టాడు. అయితే బాల్ వేయడానికి ముందు మరో ఫీల్డర్‌ని పిలిచి, అటు వైపు పెట్టాడు..

47

ఆ తర్వాతి బంతికి కరెక్టుగా అతని చేతుల్లోనే బాల్ వెళ్లి వికెట్ పడింది. అది బ్యాడ్ లక్ కావచ్చు కానీ అసలు ఫీల్డర్ రాగానే తర్వాతి బంతికే వికెట్ పడడం ఏంటి? ఓ 3-4 బాల్స్ తర్వాత అతనికి క్యాచ్ వచ్చి ఉండొచ్చుగా..

57

ఈ ఏడాది నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షార్ట్ థర్డ్ మ్యాన్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యా. నిజానికి నేను కొట్టిన ఏరియాలో ఎవ్వరూ ఫీల్డర్‌ని పెట్టరు. అది తప్పు పొజిషన్. రైట్‌కి ఉండాల్సిన ప్లేయర్, లెఫ్ట్‌కి ఉన్నాడు..
 

67
Image credit: PTI

మ్యాచ్ అయ్యాక ఎందుకు భయ్యా? అక్కడ నిల్చున్నావు? అని అడిగాను.. దానికి అతను చెప్పిన సమాధానం విని షాక్ అయ్యా. బంతి యాంగిల్‌ని బట్టి, ధోనీ ఫీల్డింగ్ యాంగిల్ కూడా మారుస్తాడు. బంతి ఎటు పోతుందో, తర్వాతి బంతి ఎటు వెళ్తుందో మాహీకి బాగా తెలుస్తాయి..
 

77
Image credit: PTI

టీవీ రిప్లై చూసినట్టుగా ఓ బ్యాటర్, తర్వాతి బంతిని ఎటు కొడతాడో అంచనా వేస్తాడని ఆ ప్లేయర్ చెప్పాడు. బంతి యాంగిల్స్‌పై అంత పట్టు సాధించాడంటే మాహీ వికెట్ల వెనక నుంచి ఎంత క్రికెట్‌ని చదివాడో కదా...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్...

Read more Photos on
click me!

Recommended Stories