ఓపెనర్లుగా రోహిత్, శుబ్‌మన్ గిల్, ధావన్... సూర్య, ఇషాన్‌కి నో ఛాన్స్! వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీలో..

Published : Jul 24, 2023, 08:03 PM IST

పదేళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న టీమిండియా ఫ్యాన్స్‌కి ఇప్పుడున్న ఏకైక నమ్మకం వన్డే వరల్డ్ కప్ 2023. 11 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ కావడంతో ఈసారి ఎలాగైనా టీమిండియా టైటిల్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు..  

PREV
17
ఓపెనర్లుగా రోహిత్, శుబ్‌మన్ గిల్, ధావన్... సూర్య, ఇషాన్‌కి నో ఛాన్స్! వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీలో..

అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వన్ ఆఫ్ ది టైటిల్ ఫెవరెట్. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి తన జట్టును ప్రకటించాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ వసీం జాఫర్...

27
Image credit: Getty

రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు వసీం జాఫర్. యశస్వి జైస్వాల్‌కి ఆసియా క్రీడల్లో చోటు దక్కడంతో లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌గా శిఖర్ ధావన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడాల్సిందేనని అంటున్నాడు వసీం జాఫర్..
 

37

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా మిడిల్ ఆర్డర్‌లో చోటు కల్పించాడు వసీం జాఫర్. కెఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌కి కూడా రిజర్వు వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు కల్పించాడు..

47
Image credit: PTI

విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హర్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు ఇచ్చిన వసీం జాఫర్, యజ్వేంద్ర చాహాల్‌ని మాత్రం పట్టించుకోలేదు...
 

57
Jasprit Bumrah

ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు కల్పించాడు వసీం జాఫర్...

67

ఇషాన్ కిషన్‌తో పాటు వన్డేల్లో ప్రభావం చూపించలేకపోతున్న సూర్యకుమార్ యాదవ్‌కి కూడా వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో చోటు దక్కలేదు. దీపక్ చాహార్ వంటి బౌలర్లను అస్సలు పట్టించుకోలేదు వసీం జాఫర్.. 

77
Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వసీం జాఫర్ ప్రకటించిన భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్

click me!

Recommended Stories