రుతురాజ్ గైక్వాడ్‌కి కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అదే! చెన్నై సూపర్ కింగ్స్‌కి కూడా అతనే.. - అంబటి రాయుడు

First Published Jul 24, 2023, 5:46 PM IST

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల జట్టుకి యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ లేదా రవిచంద్రన్ అశ్విన్‌కి కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగినా ఆఖరికి రుతురాజ్ గైక్వాడ్‌... కెప్టెన్‌గా ఎంపికయ్యాడు..
 

Sanju Samson and Ruturaj Gaikwad

దేశవాళీ టోర్నీల్లో మహారాష్ట్ర జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తొలి టెస్టు సమయంలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కి గొడుగు పడుతూ కనిపించాడు రుతురాజ్ గైక్వాడ్..

ఈ ఫోటో చూసి సీఎస్‌కే ఫ్యాన్స్ చాలా ఫీలయ్యారు. ఆ తర్వాతి రోజే రుతురాజ్ గైక్వాడ్‌కి టీమిండియా కెప్టెన్సీ చేసే అవకాశం దక్కింది. దీని వెనక మహేంద్ర సింగ్ ధోనీ రికమెండేషన్ ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా అంబటి రాయుడు, ఇదే విధమైన వ్యాఖ్యలు చేశాడు. 

Latest Videos


‘నాకు తెలిసి మాహీ భాయ్ మరో సీజన్ ఆడతాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనే డిస్కర్షన్ అనవసరం. కానీ ఫ్యూచర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు రుతురాజ్ గైక్వాడ్‌కే దక్కొచ్చు.. ఇప్పటికే మాహీ భాయ్ కెప్టెన్సీలో నాలుగు సీజన్లు ఆడాడు..
 

దేశవాళీ టోర్నీల్లోనూ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. అతని దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది. నాకు తెలిసి సీఎస్‌కేని పదేళ్ల పాటు నడిపించగల సత్తా రుతురాజ్‌ గైక్వాడ్‌లో ఉంది. త్వరలోనే రుతురాజ్ త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారతాడు...

Ruturaj Gaikwad

రుతురాజ్ గైక్వాడ్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బీసీసీఐ కూడా గుర్తించింది. ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా సక్సెస్ అయితే, సీఎస్‌కే ఫ్యూచర్ కెప్టెన్ రేసులో మిగిలిన అందరినీ అతను దాటేస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు..

ఐపీఎల్ 2023 వేలంలో బెన్ స్టోక్స్‌ని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ రిటైర్ అయిన తర్వాత బెన్ స్టోక్స్, సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేయర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు బెన్ స్టోక్స్.. 

click me!