500 వికెట్లు తీసిన అశ్విన్, జడేజా... ఇంకొక్క వికెట్ తీస్తే అనిల్ కుంబ్లే- హర్భజన్ సింగ్ రికార్డు కూడా..

Published : Jul 24, 2023, 06:35 PM IST

2010 నుంచి టీమిండియాకి టెస్టుల్లో స్పిన్ ద్వయంగా కొనసాగుతూ వస్తున్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అరుదైన ఫీట్  అందుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి టెస్టుల్లో 500 వికెట్లను పూర్తి చేసుకున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు..

PREV
15
500 వికెట్లు తీసిన అశ్విన్, జడేజా...  ఇంకొక్క వికెట్ తీస్తే అనిల్ కుంబ్లే- హర్భజన్ సింగ్ రికార్డు కూడా..
Image credit: Getty

రెండో ఇన్నింగ్స్‌లో తీసిన 2 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్+ రవీంద్ర జడేజా కలిసి 500 టెస్టు వికెట్లు పూర్తి చేసుకున్నారు. ఇంతకుముందు భారత మాజీ స్పిన్ ద్వయం అనిల్ కుంబ్లే+ హర్భజన్ సింగ్ కలిసి 501 వికెట్లు తీశారు. ఈ రికార్డుకి కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది అశ్విన్+ జడేజా ద్వయం..

25

అంతేకాకుండా రవిచంద్రన్ అశ్విన్ 712 అంతర్జాతీయ వికెట్లతో హర్భజన్ సింగ్‌ని దాటేశాడు. టీమిండియా తరుపున 707 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, వరల్డ్ ఎలెవన్ తరుపు మరో 4 వికెట్లు తీశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో హర్భజన్ సింగ్ వికెట్ల సంఖ్య 711..

35

ఈ ఫీట్‌ని అధిగమించేసిన రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే తర్వాతి స్థానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్‌లో 956 వికెట్లతో టాప్‌లో నిలిచాడు. అశ్విన్ ఈ రికార్డును అందుకోవాలంటే మరో నాలుగైదు ఏళ్లు క్రికెట్‌లో కొనసాగాల్సి ఉంటుంది...

45
Ashwin

అనిల్ కుంబ్లే 401 మ్యాచుల్లో 956 వికెట్లు పడగొట్టగా రవిచంద్రన్ అశ్విన్ 272 మ్యాచుల్లోనే 712 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్‌కి 711 వికెట్లు తీసేందుకు 366 మ్యాచులు అవసరమయ్యాయి...

55
Ashwin

అంతేకాకుండా వెస్టిండీస్‌పై 75 వికెట్లు పూర్తి చేసుకున్న రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు. అనిల్ కుంబ్లే, వెస్టిండీస్‌పై 74 వికెట్లు తీయగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 89 వికెట్లు తీసి...విండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు.. 

click me!

Recommended Stories