ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్‌కి రెస్ట్ ఇచ్చింది టీమిండియా. ఇషాన్ కిషన్ వైరల్ ఫివర్‌తో బాధపడుతుండడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు..
Rohit Sharma
హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వ్యక్తిగత కారణాలతో ముంబైకి వెళ్లడంతో రుతురాజ్ గైక్వాడ్, ఏషియన్ గేమ్స్ కోసం చైనాకి వెళ్లే టీమ్‌తో కలిశాడు. మూడో వన్డే సమయానికి టీమ్‌కి అందుబాటులో 13 మంది ప్లేయర్లు మాత్రమే ఉన్నారని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు..
శుబ్‌మన్ గిల్ లేకపోవడంతో కెఎల్ రాహుల్‌తో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడని అంతా భావించారు. ఈ ఇద్దరూ కలిసి ఇంతకుముందు వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో ఓపెనింగ్ చేసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశారు కూడా..
అయితే అన్యూహ్యంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు రోహిత్ శర్మ. అయితే ఈ ప్రయోగం పెద్దగా కలిసి రాలేదు. 30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు..
అయితే మరో ఎండ్‌లో రోహిత్ శర్మ మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడుతూ పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో తొలి వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
కెఎల్ రాహుల్‌ని మిడిల్ ఆర్డర్‌లోనే ఆడించాలని అనుకుంటే, విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్ చేయగలడు. ఇంతకుముందు రోహిత్- విరాట్ కలిసి టీ20ల్లో ఓపెనింగ్ చేశారు కూడా. కోహ్లీ, కెఎల్ రాహుల్ ఉండగా వాషింగ్టన్ సుందర్‌ని ఓపెనింగ్ పంపడం ఏంటో అర్థం కావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..